Begin typing your search above and press return to search.
యుద్ధానికే యూఎస్ సిద్ధం..పైకి శాంతి వచనాలు
By: Tupaki Desk | 23 Oct 2017 4:54 PM GMTఉత్తరకొరియా-అమెరికాల మధ్య సాగుతున్న మాటల యుద్ధం మరో మలుపు తిరిగింది. ఇటు అగ్రరాజ్యం - అటు ఉత్తరకొరియా యుద్ధానికి సన్నద్ధమైనట్లు ప్రకటనలు వెలువరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్ సన్ ఇటీవల మాట్లాడుతూ ఉత్తర కొరియా నుంచి మొదటి బాంబు పడేంత వరకూ తాము వేచిచూస్తామని - అప్పటివరకూ చర్చలు - దౌత్య మార్గాల ద్వారానే ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ పై ఒత్తిడి తీసుకొస్తామని టిల్లర్ సన్ తాజాగా వ్యాఖ్యానించారు. అయితే ఈ ప్రకటన చేసిన రెండు రోజుల్లోనే పరిస్థితి మారిపోయింది.
ఉత్తరకొరియా కదలికలపై పైకి శాంతివచనాలు వల్లిస్తున్నప్పటికీ అమెరికా వేస్తున్న అడుగులు, చేస్తున్న ఏర్పాట్లు మాత్రం దిమ్మతిరిగే రేంజ్ లో ఉన్నాయని అంటున్నారు. యుద్ధ నౌకల్ని(రొనాల్డ్ రీగన్) - అణు జలాంతర్గాముల్ని (మిచిగాన్) కొరియా ద్వీపకల్పంలో మోహరిస్తోంది.అత్యంత పెద్దదైన - శక్తివంతమైన మిచిగాన్ జలాంతర్గామిని ద.కొరియా తీరానికి అమెరికా చేర్చిందంటే దాని అర్థం, ఉత్తర కొరియాపై ఎప్పు డైనా - ఏ క్షణమైనా దాడులు చేస్తామని బెదిరించటమేనని నిపుణులు చెప్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన జలాంతర్గా మికిగా 'మిచిగాన్'కు గుర్తింపు ఉంది. మిచిగాన్ జలాంతర్గామి అత్యున్నత స్థాయి సాంకేతిక, సమాచార వ్యవస్థను కలిగి ఉంది.మిచిగాన్ అణుజలాంతర్గామికి ఉన్న మరో ప్రత్యేకత, సైనిక బలగాల ప్రత్యేక ఆపరేషన్‌కు మద్దతుగా దాడుల్లో పాలుపంచుకుంటుంది. దీనినుండి జరిగే అత్యంత భీకరమైన క్షిపణి దాడుల్ని అడ్డుకోవటం సామాన్య విషయం కాదు. ప్రత్యర్థి దేశం వద్ద బలమైన, ఉన్నతస్థాయి క్షిపణి నిరోధక వ్యవస్థ ఉండాల్సిందే.అమెరికాలోని బ్రెమెర్టాన్‌తీరం నుంచి బయల్దేరిన ఈ జలాంతర్గామి, తొలుత పసిఫిక్ మహాసముద్రం లోని గువామ్ దీవికి చేరుకుంది. అక్కడ్నుంచి 2,800 కిమీ దూరంలో ఉన్న బుసాన్‌కు గత వారం చేరుకుంది.
దక్షిణ కొరియా నావికా దళం కూడా తన అధికారిక ఫేస్ బుక్ లో అమెరికా యుద్ధ సన్నాహాల్లో ఉన్నట్లు తెలిపింది. రష్యా అధికారిక పత్రిక కూడా దీనిని ధ్రువీకరించింది. దీంతో యుద్ధం ఖాయమని అంటున్నారు. మరోవైపు ఇప్పటికే 24 గంటలపాటు అమెరికాలోని అన్ని ఎయిర్‌ఫోర్స్ బేస్ స్టేషన్లకు హైఅలర్ట్ కూడా ప్రకటించింది అమెరికా. అణ్వస్త్ర మిస్సైల్‌లను ప్రయోగించగల బీ-52బాంబర్ యుద్ధ విమానాలను ఉత్తరకొరియా దక్షిణకొరియా సరిహద్దుల్లో మోహరించేందుకు సిద్ధం చేస్తోందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.