Begin typing your search above and press return to search.
అమెరికా విమానాన్ని తాలిబన్లు కూల్చేశారు
By: Tupaki Desk | 2 Oct 2015 6:30 AM GMTతాలిబన్లు మరోసారి చెలరేగిపోయారు. అఫ్ఘన్ లో ఆరాచకం సృష్టిస్తున్న తాలిబన్లు మరోసారి తామెంత పవర్ ఫుల్ అన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పుకునే ప్రయత్నం చేశారు. ప్రపంచ పెద్దన్న అమెరికాకు చెందిన సరుకు రవాణా విమానాన్ని కూల్చేశారు. గురువారం అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన లో మొత్తం పన్నెండు మంది మరణించారు.
వీరిలో ఐదుగురు అమెరికన్ సైనికులుగా చెబుతున్నారు. అఫ్ఘనిస్తాన్ లోని జలలాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో విమానాన్ని కూల్చేసినట్లు చెబుతున్నారు. ఈ ఘటనకు తామే కారణమని తాలిబన్లు ప్రకటించినా.. విమానాన్ని ఎలా కూల్చేసిన విషయాన్ని మాత్రం వారు ప్రకటించలేదు.
సి 130 రకానికి చెందిన విమానం.. గత ఏడాది కూడా అత్యవసర ల్యాంగిండ్ జరిగింది. ఆ సయంలో ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు. తాజా ప్రమాదంలో మాత్రం విమానంలోని వారంతా మరణించినట్లు చెబుతున్నారు. దీనిపై పెద్దన్న ఏ విధంగా స్పందిస్తుందో..? అప్ఘన్ ప్రాంతంలో అమెరికాకు ఇదో పెద్ద ఎదురుదాడిగా అభివర్ణిస్తున్నారు.