Begin typing your search above and press return to search.

అమెరికాకు ల్యాప్ టాప్ ఫోబియా

By:  Tupaki Desk   |   29 May 2017 6:53 AM GMT
అమెరికాకు ల్యాప్ టాప్ ఫోబియా
X
నన్ను మించినవారు ఈ ప్రపంచంలోనే లేరంటూ జబ్బలు చరుచుకుని పెత్తనం చేసే పెద్దన్న అమెరికా ఇప్పుడు చిన్న ల్యాప్ టాప్ ను చూసి భయపడిపోతోంది. భర్తలను శాసించే భార్య చిన్న బొద్దింకకు భయపడినట్లుగా అంగబలం, అర్థబలంలో అన్ని దేశాల కంటే టాప్ లో ఉన్న అమెరికాకు ఇప్పుడు ల్యాప్ టాప్ ఫోబియా పట్టుకుంది.. ల్యాప్ టాప్ లను చూస్తేనే అమెరికా వణికిపోతోందట. అమెరికాలోకి వచ్చే ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో క్యాబిన్ లగేజ్ లో ల్యాప్ టాప్ లు తేకుండా కంప్లీట్ బ్యాన్ విధించబోతోంది. ఇప్పటికే పలు దేశాల నుంచి విమాన సర్వీసులపై ఈ బ్యాన్ ఉండగా దీన్ని పూర్తిగా విస్తరించనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల వైరస్ అటాక్ ల నేపథ్యంలో యూరప్ నుంచి అమెరికాకు విమానంలో వచ్చే ప్రయాణికులు ల్యాప్‌ టాప్‌ లు తీసుకురావద్దని అమెరికా నిషేధం విధించింది. యూరప్ నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికుల వద్ద ల్యాప్‌ టాప్స్, ట్యాబ్లెట్ లాంటి గాడ్జెట్లు తెస్తున్నారా అనే కోణంలో విమానాశ్రయాల్లో తనిఖీలు మొదలుపెట్టేసింది. ఇంతకుముందు కూడా అమెరికా ఇలా ల్యాప్ టాప్ లపై నిషేధం విధించింది. గత మార్చిలో ఎనిమిది దేశాలకు చెందిన 10 ఎయిర్‌ పోర్టుల నుంచి వచ్చే ప్రయాణికుల వద్ద ల్యాప్‌ టాప్స్ ఉండొద్దంటూ అమెరికా నిషేధించిన విషయం గుర్తుండే ఉంటుంది. వైరస్ అటాక్స్ నేపథ్యంలో దాన్ని మొత్తం యూరప్ కు వర్తించేలా చేసింది. తాజాగా ప్రపంచంలోని అన్ని దేశాల నంచి వచ్చే విమాన సర్వీసులకు వర్తించబోతోంది.

సమ్మర్‌ లో ఈయూ నుంచి ప్రతివారం 3250కి పైగా విమానాలు అమెరికాకు వస్తుంటాయి... ఆ సమయంలో వైరస్ భారినపడ్డ వారి డివైజ్‌ లు ల్యాప్‌ టాప్‌ లు - ట్యాబ్స్‌ వంటి వాటివల్ల తమ దేశంలోనూ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని భయపడుతోంది. సైబర్ దాడి వల్ల బ్యాటరీలు పేలిపోయే అవకాశం ఉందని, ఈ క్రమంలో ఉగ్రదాడులు జరగొచ్చునని కూడా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టెన్షన్ పడుతున్నారట. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ల్యాప్‌ టాప్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను సాధనాలుగా వాడుకుని సైబర్ దాడితో పాటు బాంబు దాడులు కూడా చేయొచ్చని భయపడుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/