Begin typing your search above and press return to search.
కరోనా టీకా విషయంలో కీలక నిర్ణయం
By: Tupaki Desk | 16 Oct 2021 6:37 AM GMTవిదేశీయులను అమెరికాలోకి అనుమతించే విషయంలో వైట్ హౌస్ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కరోనా వైరస్ రెండు టీకాలు వేయించుకుని నెగిటివ్ రిపోర్టు వచ్చిన విదేశీయులను అమెరికాలోకి అనుమతించాలని అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా నిర్ణయించారు. అమెరికా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం నవంబర్ 8వ తేదీ నుంచి అమల్లోకి రాబోతోంది.
కరోనా టీకాలు తీసుకున్న విదేశీయులను అమెరికాలోకి అనుమతించనున్నట్లు గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పుడు తీసుకున్న నిర్ణయం ఎప్పటినుండి అమల్లోకి వస్తుందనే విషయాన్ని ప్రకటించలేదు. కానీ నవంబర్ 8 నుండి అమల్లోకి వస్తుందని తాజాగా వైట్ హౌస్ ప్రకటించింది. అమెరికాలో కరోనా వైరస్ నియంత్రించేందుకు ప్రభుత్వం టీకాలు తీసుకోని విదేశీయులను ఎవరినీ అనుమతించకూడదని గట్టిగా నిర్ణయించింది.
ఇపుడు కూడా అదే నిబంధనను కఠినంగా అమలు చేయాలని తాజాగా నిర్ణయించింది. అమెరికా జాతీయులు కూడా ముందుగా కరోనా పరీక్షలు చేయించుకుని నెగిటివ్ రిపోర్టు వస్తేనే ప్రయాణీకులకు అనుమతిస్తున్నారు. అమెరికాలోని ఆహార నియంత్రణ ఔషధ నియంత్రణ సంస్థ గుర్తింపు పొందిన టీకాలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు పొందిన సంస్ధల టీకాలను తీసుకున్న వారి రిపోర్టును కూడా గుర్తించాలని అమెరికా ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. చైనా టీకాలు లేదా ఆస్ట్రాజెనికా టీకాలు తీసుకున్న వారి రిపోర్టును కూడా పరిగణలోకి తీసుకోవాలని వైట్ హౌస్ నిర్ణయించింది.