Begin typing your search above and press return to search.
హెచ్1బీ ఫీజు పెంపు..ఇండియన్స్ కు ట్రంప్ షాక్
By: Tupaki Desk | 7 May 2019 10:38 AM GMTఅధికారం ఎక్కినప్పటి నుంచి అమెరికన్ల భవిత తప్పితే ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడ్డ వారిని లెక్కచేయని అధ్యక్షుడు ట్రంప్ మరోసారి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోని ఇండియన్ ఐటీ కంపెనీలపై మరో భారం మోపారు. అమెరికాలోని ఐటీ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఇండియన్లను తీసుకుంటూ హెచ్1 బీ వీసా ద్వారా తీసుకెళ్తున్న ఐటీ కంపెనీలకు ట్రంప్ షాకిచ్చారు.
ట్రంప్ తాజాగా విదేశాల నుంచి వచ్చే నిపుణులకు ఇచ్చే హెచ్1బీ వీసా అప్లికేషన్ ఫీజును పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ లో ఈ మేరకు ప్రతిపాదనలు పంపినట్లు యూఎస్ లేబర్ సెక్రటరీ తెలిపారు. ఇక ఇక అమెరికా యువత కోసం అప్రెంటీస్ శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన నిధులను పెంచేందుకే నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి 2020 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో ప్రతిపాదనలు పెట్టారు.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమెరికాకు వెళ్లే వారిపై తీవ్ర భారం పడుతుంది. హెచ్ 1బీ వీసా అప్లికేషన్ ఫీజు భారీగా పెరిగితే అమెరికా వెళ్లే మెజార్టీ భారతీయులు - ఐటీ రంగంపై ఎక్కువ భారం పడనుంది. ఫలితంగా అమెరికాలోని ఇండియన్ ఐటీ కంపెనీలు అదనపు ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తుంది.
ట్రంప్ అధికారంలోకి రాగానే హెచ్1బీ వీసాలను తగ్గించేశారు. అమెరికాలో విదేశీ ఉద్యోగులు పెరిగిపోతున్నారని.. తద్వారా అమెరికన్లు నష్టపోతున్నారని.. వీసా నిబంధనలు కఠినతరం చేశారు. ఎక్కువగా చైనా, భారత్ నుంచే అమెరికాకు వలసలు ఉండడంతో మనపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది.