Begin typing your search above and press return to search.

ఎంత ప‌నిచేశావు ఒబామా!

By:  Tupaki Desk   |   10 Nov 2015 5:35 AM GMT
ఎంత ప‌నిచేశావు ఒబామా!
X
టెక్నాల‌జీకి కేరాఫ్ అడ్ర‌స్ అమెరికా. ఆ దేశ అధ్య‌క్షుడి ఉండే క్రేజే వేరు. పైగా అమెరికా ప్ర‌స్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా లాంటి చురుకైన నాయ‌కులకు ఉండే సంబంధాలు చెప్ప‌క్క‌ర్లేదు. సోష‌ల్ మీడియా ప్ర‌పంచాన్ని ఏలుతున్న క్ర‌మంలో ఒబామా తాజాగా ఫేస్‌బుక్‌లోకి వ‌చ్చారు. ఇన్నాళ్లు అమెరికా అధ్య‌క్షుడి హోదాలో ఒక ఫేస్‌ బుక్ అకౌంట్ ఉంటే ఇపుడు ఏకంగా పర్సనల్ ఫేస్‌ బుక్ పేజ్‌ ను ఓపెన్ చేశారు. ఈ పేజ్ గంట వ్య‌వ‌ధిలోనే దుమ్మురేపే స్పంద‌న‌ సాధించింది.

పర్సనల్ ఫేస్‌ బుక్ పేజ్‌ ను ఒబామా ఓపెన్ చేసి ఓపెన్ చేసిన గంటలోనే 45వేల లైక్‌ లు వచ్చాయి. రెండు గంట‌ల్లో ఆ సంఖ్య‌ల రెండుల‌క్ష‌ల‌కు చేరింది. వాతావరణ మార్పులపై ఒబామా తొలి పోస్ట్‌ ను చేశారు. భూగోళాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఒబామా తన పోస్ట్‌ లో తెలిపారు. ఒబామా దినచర్యను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేసేందుకు వైట్‌ హౌజ్‌ లో 20 మందితో కూడిన ప్రత్యేక టీమ్ పనిచేస్తోంది. అమెరికాలో ప్రతి నలుగురిలో ముగ్గురు ఫేస్‌ బుక్ వాడుతున్నారు. ఫేస్‌ బుక్ ద్వారా ప్రజా సంబంధాలను బలపరుచుకోవచ్చని ఒబామా అభిప్రాయపడ్డారు. గత మే నెలలో ఒబామా ట్విట్టర్‌ లో అకౌంట్ ఓపెన్ చేశారు. దేశాద్య‌క్షుడిగా త‌న ప్ర‌జ‌ల‌తో క‌నెక్ట్ అయ్యేందుకు ఇది అత్యుత్త‌మ విధాన‌మని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.