Begin typing your search above and press return to search.
రెస్టారెంట్ కు వెళ్లి బైడెన్ ఫుడ్ ఆర్డర్.. 50 శాతం డిస్కౌంట్ ఇస్తే ఏం చేశారంటే?
By: Tupaki Desk | 15 Oct 2022 4:54 AM GMTప్రపంచాన్ని తన కంటి సైగతో శాసించే అగ్రరాజ్యం అమెరికా. ఆ దేశాన్ని పాలించే అధ్యక్షుడే ప్రపంచాధినేత కూడా. ఆ విషయాన్ని కొందరు ఒప్పుకోకున్నా.. వాస్తవం మాత్రం అదే. అలాంటి అగ్రరాజ్యాధినేత ఒక రెస్టారెంట్ కు వెళ్లి.. తానే స్వయంగా ఫుడ్ ఆర్డర్ చేయటం.. జేబులో నుంచి డబ్బులు తీసి ఇవ్వటం లాంటి ఆసక్తికర పరిణామాలతో అంతకు మించిన సీన్ ఒకటి తర్వాత చోటు చేసుకుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన చిట్టి వీడియోకు బోలెడన్ని లైకులు వచ్చేస్తున్నాయి. ఇంతకీ అమెరికా అధ్యక్షులు వారు రెస్టారెంట్ కు వెళ్లి ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ ఏమిటి? ఆయనకు డిస్కౌంట్ ఇస్తే ఏం చేశారన్నది చూస్తే..
అమెరికన్లకు మెక్సికన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అందుకు తగ్గట్లే తనకు సైతం మెక్సికన్ ఫుడ్ అంటే ఇష్టమన్న విషయాన్ని తాజాగా ఆయన తీరుతో బయటకు తెలిసిందే. లాస్ ఏంజిల్స్ వెళ్లిన ఆయన టాకోస్ 1989 అనే మెక్సికన్ రెస్టారెంట్ ముందు ఆగారు.
అమెరికన్లు ఎక్కువగా ఇష్టపడే 'క్వాసిడిలస్' అనే వంటకాన్ని ఆర్డర్ చేశారు. అయితే.. అది తాను తినేందుకు కాదని.. లాస్ ఏంజిల్స్ మేయర్ పదవి రేసులో ఉన్న తమ పార్టీ అభ్యర్థి కరేన్ బాస్ కోసం ఆయన కొనుగోలు చేశారు.
ఆర్డర్ చేసినంతనే ఫుడ్ ప్యాక్ ను అధ్యక్షుల వారి చేతిలో పెట్టాడు..రెస్టారెంట్ క్యాషియర్. ఎంత అయ్యిందని అడిగితే.. పుడ్ బిల్లులో ఆయనకు యాభై శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రజాసేవ చేస్తున్నందుకు ఆ మొత్తాన్ని రాయితీగా ఇచ్చినట్లు చెప్పారు. దీంతో.. బైడెన్ చుట్టుపక్కల ఉన్న వారు ప్రజాసేవ చేసినందుకా? అంటూ మాట్లాడటం వీడియోలో వినిపిస్తుంది. డిస్కౌంట్ పోను 16.45 డాలర్ల బిల్ అయినట్లుగా చెప్పారు.
దీనికి బదులుగా బైడెన్ మాత్రం 60 డాలర్ల మొత్తాన్ని క్యాషియర్ చేతిలో పెట్టి.. తన తర్వాత ఫుడ్ కోసం వచ్చిన వారికి ఉచితంగా ఇవ్వాలని చెప్పారు. దీంతో.. క్యాషియర్ అందుకు అంగీకరించారు. ఈ సంభాషణను తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. 'మీకు క్వాసిడిలస్ ఫ్రీగా దొరికి ఉంటే.. నాకు తెలియజేయండి' అని పేర్కొన్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.