Begin typing your search above and press return to search.

సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. ట్రంప్ ట్వీట్ వైరల్!

By:  Tupaki Desk   |   27 Oct 2019 4:17 PM GMT
సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. ట్రంప్ ట్వీట్ వైరల్!
X
ఐసిస్.. ఈ పేరు చెబితేనే ఇప్పుడు ప్రపంచం వణికిపోతోంది. అత్యంత నరరూప రాక్షసులైన ఉగ్రవాదులుగా వీరికి పేరుంది. వీరికి దొరికిన విదేశీయులను అత్యంత కిరాతకంగా మెడ కోసి మరీ వీరు చంపేస్తుంటారు. ఈ ఐసిస్ ఇరాక్-సిరియా దేశాల్లో విస్తరించి ఎన్నో లక్షల మంది అమాయకులను అత్యంత కిరాతకంగా చంపేసింది. ఈ ఐసిస్ వ్యవస్థాపకుడు అబు బాకర్ అల్ బాగ్ధాది.

* బాగ్దాది ఓ మతప్రబోధకుడు..

ఇరాక్ లో జన్మించిన బాగ్దాది మొదట్లో అక్కడ మతపెద్దగా వ్యవహరించాడు. ఓ మౌలాలి మసీదులో ఉగ్రవాద భావజాలాన్ని ఫుణికి పుచ్చుకున్నాడు. లాడెన్ కు దగ్గర అల్ ఖైతా నంబర్ 2గా అవతరించాడు. లాడెన్, అల్ ఖైతా ఖతమయ్యాక ఐసిస్ ను స్థాపించి ప్రపంచం మొత్తం విస్తరించాడు. ఎన్నో దారుణ హత్యలు, అత్యాచారాలు, మానవ బాంబులతో దాడులు చేయించి వందలాది మందిని చంపించాడు.

*లాడెన్ తరహాలోనే..

ఇప్పటికే లాడెన్ ఆచూకీ కనుగొని అత్యంత చాకచక్యంగా అతడిని హతమార్చిన అమెరికా.. తాజాగా ఐసిస్ అధినేత, రాక్షసుడైన బాగ్ధాదిని హతమార్చాయి. ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ అధికారి ఈ ప్రకటన విడుదల చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఓ భారీ సంఘటన ఒకటి చోటుచేసుకుంది అని హింట్ ఇచ్చాడు.

* ఐసిస్ సామ్రాజ్యానికి కేంద్రం ఇడ్లిబ్ ప్రావిన్స్.

సిరియాలోని ఐసిస్ సామ్రాజ్యానికి కేంద్రం ఇడ్లిబ్ ప్రావిన్స్. ఇక్కడికి గుట్టుచప్పుడు కాకుండా ప్రవేశించిన అమెరికా ప్రత్యేక బలగాలు బాగ్దాదిని కాల్చి చంపినట్టు మీడియా సైతం ధ్రువీకరించింది. ఏడాదిగా బాగ్దాది ఇక్కడే రహస్యంగా తిరుగుతున్నాడు. అమెరికా సైన్యం వేట కొనసాగిస్తుందని తెలిసి బాగ్దాది అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు. భారత్ సహా అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ ఇలా ప్రపంచదేశాల్లో మారణహోమాలను సృష్టించాడు బాగ్దాదీ. హైదరాబాద్ లోనూ ఐసిస్ సానుభూతిపరులు విస్తరించారు.

*సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్

పాకిస్తాన్ లో నక్కిన లాడెన్ ను చంపినట్టే సీక్రెట్ గా అమెరికా సేనలు బాగ్దాదిని మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్ ను అత్యంత రహస్యంగా చేసి చంపేసినట్టు తెలిసింది. ఇడ్లిబ్ లోని బాగ్దాది స్థావరంలోనే అతడిని హతమార్చినట్టు సమాచారం. బాగ్దాదితోపాటు అతడి సహచరులు.. ఐసిస్ కమాండర్లు ఉగ్రవాదులు హతమైనట్టు తెలిసింది. ఫ్రాన్స్ - బ్రిటన్ లు ఇడ్లిబ్ ప్రావిన్స్ బయట కట్టడి చేయగా.. అమెరికా సేనలు లోపలికి ప్రవేశించి ఈ ఆపరేషన్ చేసినట్టు తెలిసింది.