Begin typing your search above and press return to search.
ట్రంప్ పురుగుల మందు మాట వాస్తవమే..కరోనా వ్యాక్సిన్ లో వినియోగం
By: Tupaki Desk | 29 April 2020 11:10 AM GMTకరోనా వైరస్ నివారణకు అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ చేసిన పురుగుల మందు సూచన వాస్తవంగా కరోనా నివారణకు దోహదం చేసేలా ఉంది. ఎందుకంటే చాలా దేశాల్లో పురుగుల మందుతో కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ కనుకునేందుకు పరిశోధనలు చేస్తున్నారు. అది ఒక్క అమెరికానే ఇతర దేశాలు కూడా ఆ విషయంపై అధ్యయనం చేస్తూ వ్యాక్సిన్ తయారీకి కృషి చేస్తున్నారు. కరోనా చికిత్స విషయంలో శాస్త్రవేత్తలు కొత్త వాదన లేవదీశారు. యాంటీ పారసైట్ (పురుగుమందు) ఐవర్ మెక్టిన్ రెండు రోజుల్లో కరోనా వైరస్‌ను చంపగలదని నార్త్ షోర్ యూనివర్సిటీ హెల్త్ సిస్టమ్ ఆఫ్ అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ నీరవ్ షా ప్రకటించారు. ఈ ఔషధం సురక్షితమని, ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండడంతో వినియోగించాలని సూచించారు.
ఇక ఆ సంస్థతో పాటు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్న మోనాష్ బయోమెడిసిన్ డిస్కవరీ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ కైలీ వోగ్‌స్టాఫ్ కూడా ఒక అధ్యయనంలో యాంటీ పారసైట్ ఔషధంలోని ఒక మోతాదు 48 గంటలు లేదా 24 గంటల్లో వైరస్‌లోని ఆర్‌ఎన్ఏను తొలగించగలదని గుర్తించారు. కరోనా సోకిన వారికి చికిత్స అందించేందుకు ఇప్పటికే యాంటీ పారసైట్ మందును ఉపయోగిస్తున్నారని ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ హెల్త్ మెడికల్ సెంటర్ డాక్టర్ జాక్వెస్ రెజ్టర్ కూడా వెల్లడించారు. దీంతో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సహజమేనని తేలుతోంది.
ఇక వారితో పాటు ఉటా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ అమిత్ పటేల్ ఈ పరిశోధనలో ఐవర్ మెక్టిన్ వెంటిలేటర్ మీద ఉంచిన రోగులలో కూడా ఈ మందు వలన మెరుగైన ఫలితాలను చూపించిందని తెలిపారు. ఇన్వర్టమైసిన్‌ను మొదట 1970-80లలో రూపొందించగా దాన్ని జంతువులలో కనిపించే కీటకాలను చంపడానికి ఉపయోగించారు. ఈ మందును ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అవసరమైన ఔషధాల జాబితాలో చేర్చింది. కరోనా వైరస్‌లో ఈ మందు ఎంత ప్రభావం చూపుతుందో అనే విషయమై మరిన్ని అధ్యయనాలు కొనసాగుతున్నాయి. దానిపై త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇన్నాళ్లు కరోనా నివారణకు హైడ్రాక్సో క్లోరోక్విన్ మందును వినియోగిస్తున్నారు. ఇప్పుడు యాంటి పారసైట్‌తో పాటు, ఇన్వర్టమైసిన్ కూడా వాడే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అధికారికంగా గుర్తించిన తర్వాతే కరోనా నివారణకు వాడాలి.