Begin typing your search above and press return to search.
ట్రంప్ తన్మయత్వం.. ఆ ఫీలింగ్స్ మాటల్లో చెప్పలేడట
By: Tupaki Desk | 25 Feb 2020 2:50 AM GMTప్రపంచంలోనే అద్భుతమైన ప్రేమ సౌధం ఎదుట అగ్రరాజ్యపు అధిపతి తన ప్రేయసితో ఠీవీగా నిలబడ్డారు. ఆగ్రాలోని తాజ్ మహల్ ను చూసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన భార్య మెలానియా పులకించిపోయారు. కుమార్తె ఇవాంక, అల్లుడు కూడా ట్రంప్ వెంట ఉన్నారు.
అమెరికా అధ్యక్షుడి పర్యటన కారణంగా పర్యాటకులను బంద్ చేసి సందర్శకులను ఎవ్వరినీ అందులోకి అనుమతించలేదు. దీంతో ట్రంప్ , మెలానియా జంట తనివితీరా తాజ్ మహల్ చుట్టూ తనివితీరా చేతిలో చేయి వేసి తిరుగుతూ పర్యటించారు. ఒక భారతీయ గైడ్ మాత్రమే వారి వెంట ఉన్నారు. ఆ తాజ్ మహల్ ప్రత్యేకత గురించి ట్రంప్ జంటకు అతడు వివరించాడు.
తాజ్ మహల్ చూశాక ట్రంప్ తన్మయత్వం చెందారు. సందర్శకుల పుస్తకం లో ఇలా వ్రాశారు.. ‘తాజ్ మహల్ మమ్మల్ని విస్మయానికి గురిచేసింది.. ప్రేరేపించింది. భారతీయ సంస్కృతి యొక్క గొప్ప , విభిన్న సౌందర్యానికి ప్రతీకగా నిలిచింది. కాలాతీత అద్భుతానికి సాక్ష్యమిది.. ధన్యవాదాలు ఇండియా’ అంటూ ఏమోషనల్ అయ్యారు.
ఇప్పటివరకూ అందరూ ప్రపంచదేశాధినేతలు భారత్ వచ్చి ఈ అపురూపమైన ప్రేమ సౌధం తాజ్ మహల్ ను చూడకుండా వెళ్లలేదు. ఇప్పుడు ట్రంప్ కూడా మన ప్రేమ చిహ్నాన్ని చూసి పులకించి పోయారు. అద్భుతమైన ఫీలింగ్స్ ను సొంతం చేసుకున్నారు.