Begin typing your search above and press return to search.
అమెరికా అధ్యక్షుడికి ఎన్ని సౌకర్యాలంటే..?
By: Tupaki Desk | 8 Nov 2016 10:21 AM GMTప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికాకు అధ్యక్షుడైతే..? సింఫుల్ గా అనిపించే ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే పదే పదే విస్మయానికి గురి కావాల్సిందే. అంతేనా? అత్యున్నత స్థానంలో ఉన్న వారికి జరిగే రాజభోగాలు లాంటి పదం కూడా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వారికి కల్పించే సౌకర్యాల ముందు చిన్నబోతుంది. వైట్ హౌస్ అధిపతిగా ఆయనకు లభించే అధికారాలు.. సౌకర్యాలు లిస్ట్ భారీగా ఉంటుంది.
అమెరికా అధ్యక్షుడి వార్షిక వేతనంతోనే భారీతనం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. అమెరికా అధ్యక్షుడికి వార్షిక వేతనం అక్షరాల మన రూపాయిల్లో అయితే.. రూ.2.66 కోట్లు. దీనికి అదనంగా రూ.33.35లక్షల వార్షిక ఖర్చుల కోసం ఇస్తారు. ఇక.. ప్రయాణాల కోసం రూ.66.71 లక్షలు చెల్లిస్తారు. అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించే వ్యక్తికి ఉండే పని ఒత్తిడి ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే.. ఆయన ఒత్తిడికి గురి కాకుండా ఉండేందుకు వీలుగా 18 ఎకరాల గ్రీన్ గ్రౌండ్ లేదంటే ప్రైవేట్ పూల్ ను ఏర్పాటుచేస్తారు. ఇక.. 55 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే సువిశాలమైన శ్వేతభవనాన్ని ఆయనకు నివాసంగా ఇస్తారు. ఈ వైట్ హౌస్ లో మొత్తం 132 గదులు ఉంటాయి.
ఈ మొత్తం గదులు నిత్యం పూల వాసనలతో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. మొత్తం వైట్ హౌస్ ను నిర్వహించేందుకు ఏడాదికి 4 మిలియన్ల డాలర్లను ఖర్చు చేస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అమెరికా అధ్యక్షుడి ప్రయాణాల కోసం 747-200బీ జెట్స్ ఉపయోగిస్తారు. ఇందులో సూపర్ లగ్జరీ ఆఫీస్.. కాన్ఫరెన్స్ రూం.. బాత్రూం.. జిమ్.. బెడ్రూం లాంటివన్నీ ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే విమానాన్ని ఎయిర్ ఫోర్స్ వన్ గా పిలుస్తుంటారు. దీన్ని గంట సేపు ప్రయాణం చేస్తే.. అందుకు అయ్యే ఖర్చు అక్షరాల 2.10లక్షల డాలర్లు (మన రూపాయిల్లో లెక్క తేల్చటానికి ఒక్కో డాలర్ కు రూ.65 చొప్పున లెక్కేస్తే ఈ విమాన ప్రయాణం ఎంత ఖరీదైందో ఇట్టే అర్థమవుతుంది)
దూరం ఎక్కువగా ఉంటే ఎయిర్ ఫోర్స్ వన్ ఉపయోగించే అధ్యక్షుల వారు తక్కువ దూరాల కోసం తన ప్రైవేటు ఛాపర్ మెరైన్ వన్ ను వినియోగిస్తారు. ఇక.. అధ్యక్షుల వారి కుటుంబం కోసం తయారు చేసే ఫుడ్ కోసం కూరగాయల్ని.. పళ్లను ప్రత్యేకంగా పెంచుతారు. ఇక.. వైట్ హౌస్ లో పెంచే తేనెటీగల నుంచి తీసిన తేనెనే అధ్యక్షుల వారు వాడుతుంటారు. ఇక.. స్పా.. స్విమ్మింగ్ ఫూల్.. బౌలింగ్ అల్లే.. స్కీట్ షూటింగ్ రేంజ్.. టెన్నిస్ కోర్టులు.. గోల్ఫ్ కోర్సు.. ఐస్ స్కేటింగ్ రింక్ ఇలా చెప్పుకుంటూ పోతే అధ్యక్షుల వారికి ఉండే వసతులు అన్నిఇన్ని కావు. ఇక.. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఏడాదికి 2లక్షల డాలర్లు పెన్షన్ కింద ఇవ్వటమే కాదు.. పెన్షన్.. ఉచిత ఆరోగ్య సదుపాయాలతో పాటు.. కార్యాలయ ఖర్చులు.. ట్రావెల్ వసతులు.. సీక్రెట్ సర్వీసులతో కూడిన భద్రత లాంటివి చాలానే ఉంటాయి. ప్రపంచాన్ని ఏలే బిగ్ బాస్ కు ఆ మాత్రం రేంజ్ ఉండకుండా ఉంటుందా..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/