Begin typing your search above and press return to search.

పాపం బైడెన్​.. విమానం ఎక్కబోయి బోర్లా పడ్డాడు.. మూడుసార్లు..!

By:  Tupaki Desk   |   20 March 2021 4:04 AM GMT
పాపం బైడెన్​.. విమానం ఎక్కబోయి బోర్లా పడ్డాడు.. మూడుసార్లు..!
X
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ వయసు 78 ఏళ్లు.. ఆ వయసులో ఎంతో చలాకీగా ఉత్సాహంగా కనిపిస్తుంటారు. ఆయన ప్రసంగాలు ఎందరినో ఆకట్టుకుంటాయి. ఆ ప్రసంగాలతోనే అమెరికా ప్రజలను ఆకట్టుకున్నారు. ఆయన ప్రత్యర్థి డొనాల్డ్​ ట్రంప్​ మరింత ఉర్రూతలూగించేలా మాట్లాడగలరు. కానీ అమెరికా ప్రజలు మాత్రం బైడెన్​కే ఓటేశారు. ఇదిలా ఉంటే తాజాగా జో బైడెన్​ విమానం ఎక్కబోయి తుళ్లిపోయి కింద పడిపోయారు. ఒక్కసారి కాదు.. ఏకంగా మూడు సార్లు. ఆయన వయసు కూడా చాలా ఎక్కువ .. అధ్యక్షుడంటే చాలా బాధ్యతలుంటాయి. విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. క్షణం తీరిక ఉండదు. పైగా వయసు మీద పడుతున్నప్పుడు ఏవో ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. ఇన్ని టెన్షన్స్​ మధ్య ఆయన విమానం ఎక్కబోయి కింద పడి పడి పోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్​ అవుతున్నది.

ఇదిలా ఉంటే .. శుక్రవారం అమెరికా అధ్యక్షుడు ఎయిర్ ఫోర్స్ వన్‌లో అట్లాంటా బయలుదేరాడు. ఈ టైంలోనే విమానం ఎక్కబోయి ఆయన తుళ్లి పడిపోయారు. మూడు సార్లు కింద పడ్డారు. ఆ వెంటనే పక్కన గల వీల్ పట్టుకొని పైకి ఎక్కేశారు. ఆ తర్వాత అందరికీ అభివాదం చేశారు. కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.జో బైడెన్​ అట్లాంటా లో ఆసియన్ అమెరికన్ నేతలతో భేటీ అయ్యారు. పార్లర్ వద్ద మాస్ ఫైరింగ్ జరగడం తో బయల్దేరారు. వెంటనే వైట్​ హౌస్​ ఆరోగ్య నిపుణులు జో బైడెన్ పరీక్షించారు. ఆయనకు కొన్ని ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు.

అయితే ప్రస్తుతం జో బైడెన్​ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వాళ్లు తేల్చిచెప్పారు.గత ఎన్నికల ముందు జో బైడెన్​ ఆరోగ్యంపై రకరకాల ప్రచారాలు సాగాయి. అధ్యక్షుడిగా ప్రమాణం చేసి .. పదవీ బాధ్యతలు చేపట్టాక ఓ సారి జో బైడెన్​ను పెంపుడు కుక్క కరిచింది. ఆ తర్వాత బైడెన్​ మళ్లీ కోలుకున్నారు. తాజాగా ఇలా జరగడం గమనార్హం.