Begin typing your search above and press return to search.
12 సెకన్ల వీడియో మోడీ పవర్ ఎంతో చెప్పేసిందా?
By: Tupaki Desk | 28 Jun 2022 3:00 AM GMTఅరుదైన సన్నివేశం ఒకటి అవిష్కృతమైంది. ప్రపంచానికి పెద్దన్న అమెరికా అధినేత స్వయంగా నడుచుకుంటూ వచ్చి.. భారత ప్రధాని భుజం తట్టి పలుకరించిన వైనం ఒకటి ఉంటుందా? అంటే చాలామంది నమ్మకపోవచ్చు. తాజాగా మాత్రం అలాంటి ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. దీనికి సాక్ష్యంగా చిట్టి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మోడీ ఇమేజ్ ను మరింత పెంచేలా మారిన ఈ ఘటనకు జర్మనీ వేదికైంది. అసలేమైందంటే..
ప్రపంచంలోనే సంపన్న దేశాలైన అమెరికా.. బ్రిటన్.. కెనడా.. ఫ్రాన్స్.. జర్మనీ.. ఇటలీ.. జపాన్.. ఈ ఏడు దేశాలు జీ7 కూటమిగా ఉండటం తెలిసిందే. ఈ కూటమి అప్పుడప్పుడూ సమావేశం అవుతుంటుంది.
తాజాగా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం.. ఆహార భద్రత.. ఉగ్రవాదంపై పోరాటంతో పాటు పలు అంతర్జాతీయ సవాళ్లపై చర్చలు జరిపేందుకు ఈ కూటమి దేశాలు జర్మనీలో సమావేశమయ్యాయి. అయితే.. ఈ కూటమితో ఏ మాత్రం సంబంధం లేనప్పటికి.. కొన్ని దేశాల్ని కూటమి అతిధ్య దేశమైన జర్మనీ ప్రత్యేకంగా ఆహ్వానించింది.
అలాంటి ఆహ్వానం అందుకున్న దేశాల్లో భారత్.. అర్జెంటీనా.. ఇండోనేసియా.. సెనెగల్.. దక్షిణాఫ్రికాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జర్మనీకి వెళ్లారు. జీ7 కూటమి దేశాధినేతలతో పాటు.. ఆహ్వానిత దేశాలకు చెందిన నేతలతోనూ సమావేశమవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సదస్సు ప్రారంభం కావటానికి ముందు సభ్య దేశాల అధినేతలంతా మాట్లాడుకుంటూ ఫోటోలు దిగుతున్నారు.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో కలిసి మాట్లాడుతూ.. మధ్య వయస్కుడైన ఆయన చేతిని పట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెట్లు దిగుతున్నారు. ఇలాంటి వేళ.. అనూహ్యంగా వెనుక నుంచి ఒక చేయి ఆయన భుజాన్ని తట్టింది. చాలా అరుదుగా మాత్రమే చోటు చేసుకునే ఈ వైనంతో వెనుదిరిగిన ప్రధాని మోడీ.. రెండు సెకన్ల వ్యవధిలోనే తన భుజాన్ని తట్టింది ప్రపంచానికి పెద్దన్న మాదిరి వ్యవహరించే అమెరికాకు అధ్యక్షుడైన జో బైడెన్ అన్న విషయాన్ని గుర్తించి.. మళ్లీ వెనక్కడి రెండు అడుగులు వేసి మరీ అప్యాయంగా పలుకరించుకున్నారు.
దీనికి సంబంధించిన 12 సెకన్ల చిట్టి వీడియో ఒకటి వైరల్ గా మారింది. నిజానికి.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ దేశాధ్యక్షుడు ట్రంప్ కు అనుకూలంగా మోడీ ప్రచారం చేయటంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఉదంతం జో బైడెన్ తో మోడీకి కాస్త దూరం పెరిగిందన్న వార్తలు వచ్చాయి. అలాంటిది.. బైడెన్ తనకు తానే స్వయంగా మోడీ వద్దకు వచ్చి.. భుజం తట్టి మరీ పలుకరించిన వైనం చూస్తే.. ప్రపంచ వ్యాప్తంగా మోడీ ఛరిష్మా ఏ స్థాయికి చేరుకుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లైందని చెప్పక తప్పదు.