Begin typing your search above and press return to search.

జోబైడెన్ కి మళ్లీ కరోనానా? ఇంకా ఏమైనా అయ్యిందా?

By:  Tupaki Desk   |   31 July 2022 6:36 AM GMT
జోబైడెన్ కి మళ్లీ కరోనానా? ఇంకా ఏమైనా అయ్యిందా?
X
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మరోసారి కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. వైరస్ నుంచి కోలుకున్న మూడు రోజుల్లోనే బైడెన్ కు మళ్లీ పాజిటివ్ రావడం చర్చనీయాంశమైంది. దీంతో జోబైడెన్ కు కరోనానా? దాని వల్ల ఇంకా ఏమైనా అయ్యిందా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైరస్ నుంచి కోలుకున్న వెంటనే మళ్లీ పాజిటివ్ రావడంతో అందరిలోనూ అనుమానాలు కలుగుతున్నాయి.

ప్రస్తుతం జోబైడెన్ కరోనాతో ఐసోలేషన్ లో ఉన్నారు. విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందని వైట్ హౌస్ వర్గాలు ప్రకటించాయి. 79 ఏళ్ల బైడెన్ గత ఏడాదే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు. బూస్టర్ డోస్ కూడా వేయించుకున్నారు. అయినప్పటికీ రెండు సార్లు కరోనా బారినపడడం ఆందోళన కలిగిస్తోంది.

ఈ నెల 21న బైడెన్ కు తొలిసారిగా పాజిటివ్ వచ్చింది. వైరస్ తీవ్రత పెద్దగా లేకపోవడం.. స్వల్ప లక్షణాలు ఉండడంతో ఐసోలేషన్ లో ఉన్నారు. అధ్యక్ష భవనంలోనే అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించారు. అయితే వైరస్ నుంచి కోలుకున్న మూడు రోజుల్లోనే మహమ్మారి మళ్లీ తిరగబెట్టడం ఆందోళన కలిగిస్తోంది.

జోబైడెన్ వయసు 70 ఏళ్లు దాటింది. దీంతో ఈ వయసు వారికి కరోనా చాలా డేంజర్. అతి తగ్గినా అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులను పాడు చేస్తుంది. ఆ వయసు వారు తట్టుకోవడం చాలా కష్టం. జోబైడెన్ కు కూడా కరోనా తర్వాత పరిణామాలు వెంటాడుతున్నట్టు తెలుస్తున్నాయి. మళ్లీ కరోనానా? ఇంకా ఏమైనా అయ్యిందా? అన్న కోణంలో అందరూ ఆరాతీస్తున్నారు.