Begin typing your search above and press return to search.

ఇందిర దెబ్బకు ఒక్కరోజే అమెరికా అధ్యక్షుడు పర్యటన

By:  Tupaki Desk   |   24 Feb 2020 10:11 AM GMT
ఇందిర దెబ్బకు ఒక్కరోజే అమెరికా అధ్యక్షుడు పర్యటన
X
భారతదేశానికి అమెరికా మిత్ర దేశంగా కొనసాగుతోంది. భారత్ - అమెరికా దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఆరుగురు అమెరికా అధ్యక్షులు భారతదేశంలో పర్యటించారు. ప్రస్తుతం భారత్ లో డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటిస్తున్నాడు. అయితే ఈ సందర్భంగా గతంలో అమెరికాల అధ్యక్షుల పర్యటనలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. అయితే భారత్ లో పర్యటించిన వ్యక్తుల్లో ఇందిరా గాంధీ హయాంలో పర్యటించిన విషయం గుర్తుకు వచ్చింది. అయితే ఆమె హయాంలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు కేవలం ఒక రోజు పర్యటన చేశారు.

1969లో మాత్రం అమెరికా అధ్యక్షుడి హోదాలో రిచర్డ్ నిక్సన్ ఒక్క రోజు పర్యటన కోసం భారత్ వచ్చారు. 1953లో ఉపాధ్యక్షుడిగా - అంతకు ముందు పలుసార్లు వ్యక్తిగత పర్యటనల్లో భాగంగా మన దేశానికి వచ్చారు. ఆయనకు భారత్‌ అంటే ఆయనకు అభిమానం లేదు. నిక్సన్‌కు భారతీయులంటే ఏహ్యభావం ఉండేది. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ అంటే ఆయనకు నచ్చదు.. దీంతో వారిద్దరూ మధ్య విబేధాలు ఉన్నాయి. అయితే అతడి ప్రవర్తన తెలుసుకున్న ఐరన్ లేడీ ఇందిరా గాంధీ కూడా అదే వైఖరి ప్రదర్శించారు. నిక్సన్‌ ను ఆమె కూడా అలాగే చూసేవారు. అయితే దీనిపై ఓ రచయిత తన పుస్తకంలో ఈ విషయం ప్రస్తావించారు. బ్లడ్ టెలిగ్రామ్ అనే పుస్తకంలో రచయిత గేరీ బాస్ నిక్సన్ భారత పర్యటన విషయం ప్రస్తావించారు.

‘నిక్సన్‌ కు భారతీయులంటే ఇష్టం ఉండేది కాదు. ఇందిరాగాంధీ అంటే అతడికి అలుసు. అయితే, అవతలి వైపు నుంచి కూడా అలాంటి తీరే ఉండేది’ అని తెలిపా. 1971లో ఇందిరా గాంధీ అమెరికాలో పర్యటించి శ్వేత సౌధాన్ని సందర్శించినప్పుడు ఈ భిన్నాభిప్రాయాలు బహిర్గతమయ్యాయి. ఇందిరాగాంధీని ‘ఓల్డ్ విచ్’ అంటూ నిక్సన్ తిట్టుకునేవారని అన్ని పత్రాలు బయటపెట్టాయి. అయితే ఆ సమయంలో భారత్ పాటిస్తున్న ‘అలీన విధానం’ అమెరికాను తీవ్ర కలవరానికి గురి చేసింది.

అయితే ఆ సమయంలో ఇందిరాగాంధీ పాలనలో అలీన విధానం సోవియట్ అనుకూల విధానంగా ఉండడంతో అమెరికా అసహనం వ్యక్తం చేసింది. ఆ సమయంలోబంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి భారత్ మద్దతుగా నిలబడటం తదితర కారణాలతో ఆ సమయంలో అమెరికాతో భారత్ మధ్య బంధం దెబ్బతింది. పాకిస్థాన్‌ మిత్రత్వం ఉండడంతో ఇందిరా గాంధీ ఏ మాత్రం భయపడలేదు. ఆ సమయంలో పాక్ రెచ్చిపోతున్న విషయమై అమెరికాకు స్పష్టమైన సంకేతాలు ఇందిరాగాంధీ పంపారు. పాకిస్థాన్‌ కు ఆయుధాలు - సామగ్రి సమకూర్చడానికి అమెరికా సిద్ధపడటంతో తక్షణమే ఇందిరాగాంధీ రంగంలోకి దిగారు. ఐరోపాలో పర్యటించి బ్రిటన్ - ఫ్రాన్స్‌లను పాక్ వ్యతిరేకంగా పనిచేయడానికి ఒప్పించారు. అంతేకాదు సోవియట్ యూనియన్‌ తో ఇరవయ్యేళ్ళ మైత్రీ ఒప్పందం కుదుర్చుకుని ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశారు.

ప్రధాని ఇందిరా గాంధీ వైఖరితో ఆయన భారత పర్యటనను ఒకరోజు మాత్రమే కేటాయించారు.