Begin typing your search above and press return to search.
భాద పడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్..ఎందుకంటే !
By: Tupaki Desk | 27 April 2020 9:16 AM ISTఅగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ .. ఏ విషయం పై నైనా కూడా ఒక సరైన అవగాహన లేకుండానే వివాదాస్పదంగా మాట్లాడటం అయన సహజ స్వభావం. అయితే, ప్రస్తుతం అమెరికాలో కరోనా చాలా వేగంగా విజృంభిస్తుంది. అయినప్పటికీ కూడా ట్రంప్ ఏ మాత్రం మారలేదు. ప్రజల ఆరోగ్యం కన్నా ఎకానమీ మీదే దృష్టి పెడుతూ వచ్చిన ట్రంప్ వ్యాఖ్యల పై తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. కరోనా కట్టడికి క్రిమిసంహారకాలు తీసుకోవాలంటూ అయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
దీనితో ఇక చేసేదేమి లేక .. కేవలం వ్యంగ్యపూరితంగా అలా మాట్లాడానని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. ట్రంప్ తాను అన్న వ్యాఖ్యలపై పచ్చాత్తాపం వ్యక్తం చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. కాగా కరోనా రోగులకు క్రిమిసంహారక మందులను ఎక్కించడంతో పాటు అతినీలలోహిత కిరణాలను శరీరంలోకి పంపించాలంటూ ట్రంప్ ఉచిత సలహా ఇచ్చారు. అలాగే, దీనిపై వైద్యులు అధ్యయనం చేయాలని సూచించారు. కరోనాపై పోరాటానికి ఏర్పాటైన వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆయన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు.
వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్ వైద్యురాలు డా.డెబోరా బ్రిక్స్ స్పందిస్తూ.. ఈ వార్తలు తనకు బాధ కలిగించాయని , అయితే గత నాలుగు రోజులుగా దీనికి సంబంధించిన వార్తలే ప్రసారం చేస్తూ, అమెరికా ప్రజలను రక్షించుకునేందుకు అవసరమయ్యే విషయాలను పక్కకు పెడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఎటువంటి లక్షణాలు లేని కరోనా రోగుల సంఖ్య పెరుగుతోందని, ప్రస్తుతం వాటిపై దృష్టి పెట్టాలని, అసలు ఇటువంటి సమయంలో ఇంకా అధ్యక్షుడి వ్యాఖ్యలను పట్టుకుని వేలాడటం సరికాదన్నారు. దేశంలో కరోనా కట్టడిలోకి తీసుకురావడానికి పోరాటం చేయాలనీ కోరారు.