Begin typing your search above and press return to search.

గ్రీన్‌ కార్డ్‌ - వీసాదారుల‌కు ట్రంప్ తాజా షాక్ ఇదే

By:  Tupaki Desk   |   23 Sep 2018 7:59 AM GMT
గ్రీన్‌ కార్డ్‌ - వీసాదారుల‌కు ట్రంప్ తాజా షాక్ ఇదే
X
ర‌క్ష‌ణాత్మ‌క‌ విధానాల‌తో ముందుకు సాగుతూ క‌ల‌క‌లం రేకెత్తిస్తున్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచ‌ల‌న నిర్ణ‌యానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ ద‌ఫా అమెరికాకు రావాల‌నుకునే వారికి మాత్ర‌మే షాకిచ్చే నిర్ణ‌య‌మే కాకుండా...ఇక్క‌డ నివ‌సిస్తున్న వారికి అందులోనూ గ్రీన్‌ కార్డ్ తో శాశ్వ‌త హోదా ద‌క్కిన వారికి సైతం మైండ్ బ్లాంక్ చేసే ప్ర‌తిపాద‌న‌ల‌తో ట్రంప్ సిద్ధ‌మ‌వుతున్నారు. ఇంత‌కీ ఆ షాకింగ్ నిర్ణ‌యాలు ఏంటంటే...అమెరికాలో నివ‌సించాలి అంటే..ప్ర‌భుత్వ‌ప‌రంగా ద‌క్కే ప్ర‌యోజ‌నాలు వ‌దులుకోవాల్సిందే. అది కొద్దికాలం నివ‌సించేందుకు ఉప‌యోగించే వీసాలు అయినా కావ‌చ్చు లేదా గ్రీన్‌ కార్డ్ అయినా అయి ఉండ‌వ‌చ్చు ఈ ష‌ర‌తుకు ఒప్పుకోవాల్సిందేన‌ట‌. డిపార్ట్‌ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యురిటీ(డీహెచ్ ఎస్‌) సిద్ధం చేస్తున్న‌ ప్ర‌తిపాదన‌లు అంటూ సీఎన్ ఎన్ ఈ సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించింది.

హెచ్‌ 1బీ వీసాలపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారి జీవిత భాగస్వాములకు ఉద్యోగం చేసుకునే అనుమతిని రద్దుచేసే విషయంపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకుంటామని ట్రంప్‌ సర్కార్‌ ఫెడరల్‌ కోర్టుకు తెలిపిన క‌ల‌క‌లం భార‌తీయుల‌ను షాక్‌ కు గురిచేసిన ఉదంతం స‌ద్దుమ‌ణ‌గ‌క‌ముందే ఈ సంచ‌ల‌న ప్ర‌తిపాద‌న తెర‌మీద‌కు వ‌చ్చింది. అమెరికాలో ప్ర‌భుత్వ ప్ర‌యోజ‌నాలు అయిన స‌ర్కారీ నివాసం - ఫుడ్ స్టాంప్‌ - వాటికి స‌రిపోయే ఆర్థిక ప్ర‌యోజ‌నాలు వంటివి పొందేందుకు విదేశీయుల‌ను అన‌ర్హుల‌ను చేయాల‌నే ఉద్దేశంతో ఈ ప్ర‌తిపాద‌న‌లు పెడుతున్నారు. అమెరికాకు వ‌ల‌స వీసా మీద వ‌చ్చిన వారు - గ్రీన్‌ కార్డ్‌ తో శాశ్వ‌త నివాసం హోదా పొందిన వారి వ‌ల్ల అమెరిక‌న్లు చెల్లిస్తున్న ప‌న్ను సొమ్ము పెద్ద ఎత్తున ఖ‌ర్చు అవుతోంద‌ని ఇందులో భాగంగానే కొన్ని నిర్ణ‌యాల‌ను తీసుకోవాల‌ని ట్రంప్ స‌ర్కారు భావిస్తోంద‌ట‌. ఈ ప్ర‌కారం ప్రభుత్వ ప్ర‌యోజ‌నాల‌ను ఈ రెండువ‌ర్గాలు ఉప‌సంహరించుకోవాల‌ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యురిటీ ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేస్తోంద‌ని సీఎన్ ఎన్ పేర్కొంది.

ఈ ప్ర‌తిపాద‌న‌ల‌పై డిపార్ట్‌ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యురిటీ సెక్ర‌ట‌రీ కిర్స్‌ట‌న్ నీల్సన్ మాట్లాడుతూ అమెరికా వ‌ల‌స వ‌చ్చేవారు ప్ర‌భుత్వ ప్ర‌యోజ‌నాల కోసం ఆధార‌ప‌డ‌కుండా స్వ‌యం సమృద్ధి క‌లిగిన వారిమ‌ని రుజువు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. త‌ద్వార అమెరికా టాక్స్ పేయ‌ర్ల సొమ్మును వృథా కాకుండా ప్ర‌జాహిత ప‌థ‌కాల‌ను మ‌ల్లించ‌వ‌చ్చ‌ని తెలిపారు. ఈ నిర్ణ‌యం చ‌ట్ట‌స‌భ‌ల్లో ఆమోదం పొందిన త‌ర్వాత అమ‌లులోకి రానుందని ఆయ‌న వెల్ల‌డించారు. కాగా, ఈ నిర్ణ‌యం అమెరికాలో నివ‌సిస్తున్న‌ - భ‌విష్య‌త్తులో అమెరికాలో అడుగుపెట్టాల‌ని భావిస్తున్న ల‌క్ష‌లాది మందికి శ‌రాఘాతంగా మార‌నుంద‌ని పేర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే చ‌ట్ట‌స‌భ‌ల్లో ఈ ప్ర‌క్రియ ఆగిపోవ‌డం లేదా స‌వ‌ర‌ణ‌లు తెర‌మీద‌కు రావ‌డం జ‌ర‌గ‌వ‌చ్చ‌ని విశ్లేషిస్తున్నారు.