Begin typing your search above and press return to search.
హెచ్1బీ వీసాల విషయంలో గుడ్ న్యూస్
By: Tupaki Desk | 19 Sep 2017 12:48 PM GMTభారతీయ టెకీలకు గుడ్ న్యూస్. అగ్రరాజ్యం అమెరికాలో కెరీర్ వెతుక్కునేందుకు మన సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఎక్కువగా ఆధారపడే హెచ్1బీ వీసాల విషయంలో అమెరికా తీపికబురు తెలిపింది. ఐదు నెలల తర్వాత మరోసారి హెచ్-1బీ వీసాల జారీ ప్రక్రియను అమెరికా మొదలుపెట్టింది. ఐదు నెలల కిందట దీనిపై సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. అయితే యూఎస్ కాంగ్రెస్ ఆదేశాల మేరకు ఓ పరిమితి వరకు మళ్లీ ప్రక్రియను ప్రారంభించారు.
విదేశీ సాంకేతిక నిపుణుల కోసం జారీ చేసే ఈ హెచ్-1బీ వీసాలు ఉన్నవారిని అమెరికా కంపెనీలు వేల సంఖ్యలో హైర్ చేసుకుంటాయి.హెచ్1బీ వీసాలను ఇండియన్ టెకీలే ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ఇది నాన్ ఇమ్మింగ్రెంట్ వీసా. ఆదివారం నుంచి హెచ్-1బీ వీసా పిటిషన్లను ప్రాసెస్ చేయడం యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ మొదలుపెట్టింది. 2018 ఆర్థిక సంవత్సరానికిగాను 65 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేయనున్నారు. అమెరికాలో హైయర్ డిగ్రీ ఉన్నవారికి అదనంగా జారీ చేసే 20 వేల వీసాల కోసం కూడా వచ్చిన పిటిషన్లను పరిశీలిస్తున్నారు. 15 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని యూఎస్ సీఐఎస్ తెలిపింది. 15 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే.. వీసా కోసం కట్టిన ఫీజు తిరిగిచ్చి ఆ ప్రక్రియను కొనసాగిస్తామని స్పష్టంచేసింది.
కాగా, ప్రతి ఏటా 85 వేల హెచ్-1బీ వీసాలను అమెరికా జారీ చేస్తుంది. ఈ మొత్తం 85 వేల వీసాల్లో 65 వేలు జనరల్ కేటగిరీ కాగా.. 20 వేల వీసాలను అమెరికా విద్యాసంస్థల్లో మాస్టర్స్ - అంతకన్నా ఉన్నత చదువులు చదివిన విదేశీ విద్యార్థులకు జారీ చేస్తారు. ప్రత్యేక నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులను తాత్కాలికంగా తమ కంపెనీల్లో నియమించుకొనే అవకాశం హెచ్-1బీ వీసాల వల్ల కలుగుతుందని ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తెలిపింది. సైన్స్ - ఇంజినీరింగ్ - ఐటీ రంగాల్లో ఎక్కువగా హెచ్-1బీ వీసాదారుల అవసరం ఉంటుంది. యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ దరఖాస్తులను స్క్రూటినీ చేసి.. పరిమితి చేరుకోగానే మరో ప్రకటన జారీ చేస్తారు. ఇక ఫార్మ్ ఐ-129 ఫైల్ చేయడానికి ఉన్న ఫీజును ఈసారి 460 డాలర్లకు పెంచారు.