Begin typing your search above and press return to search.
హెచ్1బీ వీసా అర్హులకు అమెరికా గుడ్ న్యూస్
By: Tupaki Desk | 4 Oct 2017 11:05 AM GMTఅధ్యక్షుడిగా ఎన్నికయింది మొదలు భారత్ కు వరుసగా షాకులుస్తున్న డొనాల్డ్ ట్రంప్ సర్కారు తాజాగా ఓ తీపికబురును అందించింది. అమెరికాలో ఉద్యోగం చేయడానికి ఉపకరించే హెచ్1బీ వీసాల పరిశీలనను అమెరికా పున:ప్రారంభించింది. అన్ని కేటగిరీల హెచ్1-బి వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ప్రారంభించినట్లు యుఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్ సిఐఎస్) అధికారులు ప్రకటించారు. హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తులు కుప్పులుతెప్పలుగా రావడంతో కొంతకాలంనుంచి ఈ ప్రక్రియను నిలిపివేసింది. భారతీయ ఐటీ నిపుణులు అత్యధికంగా హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే జాబితాలో ఉంటున్నారు. దీంతో ఈ నిర్ణయం మన టెకీలకు కలిసి వస్తుందని అంటున్నారు.
ఈ ఏడాది మార్చిలో హెచ్1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్ సీఐఎస్) స్పష్టం చేసింది. ఏప్రిల్ 3 నుంచి హెచ్1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ రద్దు అమల్లోకి రానుందని తెలిపింది. హెచ్1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ రద్దు ఆరు నెలల వరకు తాత్కాలిక రద్దు ఉండవచ్చని యూఎస్ సీఐఎస్ తెలిపింది. అనుకున్నట్లుగానే ఆరునెలల తర్వాత వాటిని తిరిగి ప్రాసెస్ చేయడం మొదలుపెట్టింది. తాజా ప్రాసెసింగ్ లో భాగంగా ఒక్కో అప్లికేషన్ కు అయ్యే ఖర్చు 1,225 డాలర్లుగా యూఎస్ సీఐఎస్ పేర్కొంది. ఒకవేళ పిటిషనర్ - ఏజెన్సీ ప్రీమియం ప్రాసెసింగ్ సర్వీసును కోరితే, యూఎస్ సీఐఎస్ 15 రోజుల్లోగా వీసా మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటుందని, ఆ లోపు మంజూరు కాకపోతే ఏజెన్సీ పిటిషనర్ ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును వెనక్కి ఇచ్చేయనున్నట్టు వివరించింది.
కొద్ది రోజుల పాటు ఆయా కంపెనీల తరపున ఉద్యోగం చేసేందుకు హెచ్1బీ వీసాలపై అమెరికాకు వెళ్తుంటారు. ఈ క్రమంలో కంపెనీలు తమ ఉద్యోగులను అమెరికా పంపించేందుకు వీసా ప్రాసెసింగ్ త్వరగా అయ్యేందుకు 1,125 అమెరికా డాలర్లను స్పెషల్ ఫీజు కింద చెల్లిస్తున్నాయి. దీంతో రెగ్యులర్ హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులు వెనుక పడుతుండటంతో ప్రస్తుతం ఆ పద్ధతికి స్వస్తి చెప్పింది. ప్రీమియం ప్రాసెసింగ్ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేయడంతో చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న రెగ్యులర్ హెచ్1బీ వీసాలను త్వరగా ప్రాసెస్ చేసే అవకాశం ఉందని యూఎస్ సీఐఎస్ ఆ సమయంలో వివరించింది.
అయితే ప్రీమియం ప్రాసెసింగ్ కింద ఒక అభ్యర్థి హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ అభ్యర్థికి వీసా వచ్చేది లేనిది తేల్చేందుకు కేవలం 15 రోజుల సమయం మాత్రమే పడుతుంది. ఈ క్రమంలో ప్రీమియం ప్రాసెసింగ్ దరఖాస్తులు ఎక్కువ అవడంతో రెగ్యులర్ హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వీసా ప్రాసెసింగ్ చేసుకునేందుకు మూడు నెలలపైనే సమయం పడుతుందని...అందుకే హెచ్1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు యూఎస్ సీఐఎస్ స్పష్టం చేసింది. కానీ ఈ పరిణామం కంపెనీల పాలిట ఇబ్బందికరంగా మారాయి. తాజా నిర్ణయంతో ఆ సమస్య తొలగిపోనుంది.