Begin typing your search above and press return to search.
యుద్ధం తప్పదు..అమెరికా ఉపగ్రహాలు తేల్చాయి
By: Tupaki Desk | 15 Oct 2017 5:31 AM GMTపట్టుదల...తిక్క... మొండితనం కలిగి ఉన్న ఇద్దరు నేతల కారణంగా మరోమారు యుద్ధం సంభవించనుందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా....ఉత్తరకొరియా రథసారథి కిమ్ పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్నారా? అమెరికా ఉపగ్రహాలు ఈ మేరకు ఖచ్చితమైన రిపోర్ట్ ఇచ్చాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అమెరికా సైనిక స్థావరాలున్న దక్షిణకొరియా సమీపంలోని గువాం ద్వీపంపై దాడికి కిమ్ సిద్దపడుతున్నారట. ఇప్పటికే గువాం లక్ష్యంగా వాసాంగ్ 14 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్, వాసాంగ్ 12 ఇంటర్ మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్ళను ఉత్తరకొరియా సరిహద్దుల్లో మోహరించడం ఇందుకు నిదర్శనమని తెలుస్తోంది. కిమ్ తీరుపై అనుమానమున్న అమెరికా ఉత్తరకొరియాపై నిఘా పెట్టింది. ఆ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని కొన్ని ఉపగ్రహాలు రోదశిలో తిరుగుతున్నాయి. ఇవి ఎప్పటికప్పుడు ఉత్తరకొరియాలో సైన్యం, ఆయుధాల కదలికల్ని పసిగట్టి చిత్రాల్ని వాషింగ్టన్‌కు చేరవేస్తున్నాయి. శనివారం ఈ శాటిలైట్ల నుంచి అందిన చిత్రాల్ని పరిశీలించిన అమెరికా నివ్వెరపోయింది. ఇప్పటికే కిమ్ యుద్ధం దిశగా ఏర్పాట్లు చకచకా చేసుకుపోతున్నట్లు ధృవీకరించుకుంది. దీంతో ఏ సమయంలోనైనా కిమ్ ఆయుధ దాడి మొదలెట్టే అవకాశాల్ని అమెరికా శంకిస్తోంది.
కిమ్ తన దేశంలో అంతర్లీనంగా ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నా అమెరికా సైన్యం మాత్రం ఎప్పటికప్పుడు ఇది అంతర్జాతీయ సమాజం పరిష్కరించాల్సిన అంశమేనంటూ పేర్కొంటూ వచ్చింది. కానీ ఇటీవల ఖండాంతర అణుక్షిపణిని ఉత్తరకొరియా విజయవంతంగా ప్రయోగించడంతో అమెరికాలోనూ వణుకు మొదలైంది. అలాగే ముందస్తు చర్యలు తీసుకోని పక్షం లో అంతర్జాతీయ సమాజం ముందు తాము లోకువైపోతామన్న భయం కూడా పాలకులకు పట్టుకుంది. రెండుమాసాల క్రితంతో పోల్చినా ఉత్తరకొరియా సైనిక, ఆయుధ సామర్థ్యాన్ని అనూహ్యంగా పెంచుకుందని ఇప్పుడు అమెరికా సైనిక వర్గాలు గుర్తించాయి. ఇందుకు చైనా, రష్యాలు పరోక్షంగా సహకరించాయన్న సందేహం కూడా ఆ దేశానికి ఏర్పడింది. ఉత్తరకొరియాపై ఆంక్షల్ని అమలు చేసినప్పటికీ చైనా అక్రమ మార్గాల్లో క్షిపణి, ఆయుధ, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భారజలాన్ని, అణుమిశ్రమాన్ని కూడా సరఫరా చేసిందన్న అనుమానాలు అమెరికాలో వెల్లువెత్తుతున్నాయి. లేకుంటే ఇంతవేగంగా ఉత్తరకొరియా అత్యాధునిక ఆయుధ సామాగ్రిని సముపార్జించుకోవడం దుర్లభమని భావిస్తోంది. అదికూడా పటిష్టమైన ఆర్థిక, ఆయు ధ ఆంక్షలు అమలౌతున్న దశలో యుద్దమంటూ సంభవిస్తే ఖచ్చితంగా అణుదాడి సాగుతుందన్న ఆందోళన కూడా అమెరికాలో ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ దేశ ఉపగ్రహాలతో నిఘా పెట్టింది.
గువాంగ్ ద్వీపంలోఆయుధ సంపత్తినే కిమ్ లక్ష్యంగా చేసుకున్నారని ఉపగ్రహాల రిపోర్ట్ అమెరికాలో వణుకు పుట్టించింది. తొలుత ఆ ద్వీపాన్ని నాశనం చేయడం ద్వారా తమ సైనిక ఆయుధ బలగాల్ని దెబ్బతీసేందుకు కిమ్ ప్రయత్నిస్తాడని అమెరికా అంచనాలేస్తోంది. ఇంతవరకు కిమ్‌ను మతి తప్పిన వాడిగానే పరిగణించిన అమెరికా ఇప్పుడు ఈ విషయంలో తన ఆలోచనల్ని కూడా మార్చుకుంటోంది. ఇంతవరకు కేవలం ట్రంప్ మాత్రమే దూకుడుగా వ్యవహరించారు. ఆయన కార్య దర్శులు, ప్రభుత్వంలోని ఇతర పెద్దలు కూడా ట్రంప్ తరహాలో వ్యాఖ్యలు చేయ లేదు. ఆఖరకు సైన్యం కూడా కిమ్ విషయంలో ఆచితూచే వ్యవహరిస్తోంది. కానీ ఇప్పుడు అమెరికా ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మార్క్‌మిల్లి ఇక తాము వేగం పుంజుకోక తప్పదంటూ చేసిన వ్యాఖ్యలు మారిన అమెరికా సైన్యం దృక్పధానికి అద్దం పడుతున్నాయి. యుద్దమంటూ సంభవిస్తే ఖచ్చితంగా అణుదాడి సాగుతుందన్న ఆందోళన కూడా అమెరికాలో ఏర్పడింది. అయితే ఈ సాకుతో ముందుగానే ఉత్తరకొరియాపై అణుబాంబులేసేందుకు అమెరికా పన్నిన ముందస్తు వ్యూహమా లేక నిజంగానే కిమ్ అణుదాడికి సాహసిస్తాడా అన్న సందేహాలు మిగిలిన దేశాల్లో వ్యక్తమవుతుండటం గమనార్హం.