Begin typing your search above and press return to search.

తాలిబన్ లతో అమెరికా రహస్య ఒప్పందం చేసుకుందా?

By:  Tupaki Desk   |   15 Aug 2021 6:30 AM GMT
తాలిబన్ లతో అమెరికా రహస్య ఒప్పందం చేసుకుందా?
X
అప్ఘనిస్తాస్ దేశం త్వరలో తాలిబన్ల వశం కాబోతుంది. ఈ విషయాన్ని తాలిబన్లు స్వయంగా ప్రకటించారు. ఇప్పటికే దేశంలో 70 శాతం ఆక్రమించిన తాలిబన్లు మరికొద్ది రోజుల్లో దేశం మొత్తం తమ ఆధీనంలోకి వస్తుందని తెలుపుతున్నారు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నిస్సాహయతను ప్రకటించడంతో అమాయక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న దాడులు అనేకం. మహిళలన్ని కిడ్నాపులు చేస్తున్నారని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని అతి కీలక నగరమైన మజారే షరీఫ్ ను తాలిబన్లు వశ పరుచుకోవడంతో ప్రభుత్వ అధికారులు, పోలీసులు అక్కడి నుంచి నిష్క్రమించారు. దేశంలోని ప్రజలను కాపాడేందుకు అప్ఘన్ ప్రభుత్వం తాలిబన్లతో చర్చలు జరుపుతామంటోంది. అయితే తాలిబన్ల నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

ఇదిలా ఉండగా ఇప్పటికే అప్ఘనిస్తాన్ దేశం నుంచి బలగాలను వెనక్కి రప్పించేందుకు బైడెన్ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీంతో అమెరికా సైనిక బలగాలు అప్ఘన్ దేశం విడిచి వెళుతున్నారు. ఈ తరుణంలో అమెరికా, అప్ఘనిస్తాన్ మధ్య ఈ ఒప్పందం ఏమిటి..? అమెరికా సైనికులు అప్ఘినిస్తాన్లో ఉండడానికి కారణమేంటి..? అనే సందేహం చాలా మందిలో కలుగుతోంది. వారం రోజుల్లో అప్ఘనిస్తాన్ ను ఆక్రమిస్తామని ప్రకటించిన నేపథ్యంలో అమెరికా సైనిక బలగా వెనక్కి వెళ్లడంపై ఈ చర్చ మొదలైంది. ఈ విషయంపై లోతుగా పరిశీలిస్తే..

అమెరికాకు, అప్ఘనిస్తాన్ కు మధ్య ఖతార్ లోచర్చలు జరిగాయి. అయితే ఈ చర్చల్లో ప్రభుత్వానికి సంబంధం లేకుండా తాలిబన్లతో అమెరికా చర్చలు నిర్వహించింది. ఈ చర్చల ద్వారా తాలిబన్లకు లేని చట్టబద్దత కల్పించినట్లయింది. అయితే ఈ చర్చల్లో కొన్ని విషయాలపై ఒప్పందాలు జరిగాయి. ఇందులో మొదటిది అప్ఘానిస్తాన్ కు చెందిన తాలిబన్లు, ఇతర తీవ్ర వాద సంస్థలు అమెరికా పై దాడులు చేయకూడదు. ఇక తాము ఇస్లాం ప్రభుత్వం ఏర్పరుచుకోవడానికి సహకరించాలి. అలాగే జాతీయంగా చర్చలు జరుపుకునేందుకు అవకాశం ఇవ్వాలి. మరోకటి కాల్పుల విరమణ పాటించాలి.

కానీ తాలిబన్లు ఒప్పందాలను ఉల్లంఘించారు. అప్ఘనిస్తాన్ ను పట్టించుకోలేదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించలేదు. ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని చెప్పి మాట మార్చారు. దీంతో వారు దాడులతో దేశ భూభాగాన్ని ఆక్రమిస్తున్నారు. వారం రోజుల్లో 17 నగరాలు వారు ఆక్రమించేసుకున్నారు. మరిన్ని ప్రాంతాల్లో పోలీసులకు తాలిబన్లకు మధ్య పోరు జరుగుతోంది ఇక్కడ కూడా వారిదే పై చేయి అన్నట్లు సాగుతోంది. దేశ రాజధాని కాబూల్ కు 30 కిలోమీటర్ల వరకు ఆక్రమించారు. దీంతో ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. కొన్ని చోట్ల ప్రభుత్వ అధికారులు తాలిబన్లతో కలిసిపోతున్నారు.

ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే అమెరికా బలగాలపై తాలిబన్లు ఎలాంటి దాడులు చేయడం లేదు. వారు సురక్షితంగా తమ ప్రాంతాలకు వెళ్లే వరకు వేచి చూస్తున్నారు. కానీ అప్ఘన్ ప్రభుత్వంపై తాలిబన్లు విరుచుకుపడుతున్నారు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాలిబన్లు ప్రభుత్వంపై ఎలాంచి చర్యలకు పూనుకున్నా తమకేం సంబంధం లేదన్న విధంగా చర్చలు జరిగాయా..? అని అనుకుంటున్నారు. అమెరికా తాలిబన్లతో రహస్యంగా జరిగిన ఇంకేమైనా ఒప్పందం ఉందా..? అని చర్చించుకుంటున్నారు.

ఒకప్పుడు తీవ్రవాదాన్ని అంతం చేస్తాం.. తాలిబన్లను లేకుండా చేస్తామంటూ ప్రకటించిన అమెరికా ఇప్పుడు వారిని ప్రొత్సహిస్తుందా..? అని అనుమానిస్తున్నారు. దీంతో అప్ఘనిస్తాన్లో అంతర్యుద్ధం ప్రేరేపించిందని తెలుస్తోంది. అమెరికా తన బలగా రక్షణను చూసుకొని అప్ఘన్ సాధారణ ప్రజలపై దాడులు చేస్తున్నా చూస్తూ ఉండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాలిబన్లు ఈ విధంగా రెచ్చిపోతుంటే అమెరికా ప్రేక్షక పాత్ర వహిస్తుంది. అసలు అమెరికా తలుచుకుంటే తాలిబన్లు ఇలా రెచ్చిపోతారా..? అన్న చర్చ సాగుతోంది.