Begin typing your search above and press return to search.
కీలక పదవుల్లో మనోళ్లను నియమించిన ట్రంప్
By: Tupaki Desk | 5 Aug 2017 8:45 AM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవాస భారతీయుల పట్ల తన సానుకూల దోరణిని కొనసాగిస్తున్నారు. అమెరికాలోని ట్రంప్ సర్కారు కీలకమైన మూడు ప్రభుత్వ పదవులకు ముగ్గురు భారతీయ అమెరికన్లను నియమించింది. ఈ నియామకాలను సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదించటం విశేషం. ఇందులో ఒకటి భారత్-అమెరికాల మధ్య తీవ్ర విభేదాలకు దారి తీసిన మేథోసంపత్తి హక్కుల రంగం కావటం విశేషం. విశాల్ అమీన్ ను మేథోహక్కుల సంపత్తి అమలు సంస్థ సమన్వయకర్తగా నియమించారు. నీల్ ఛటర్జీని ఫెడరల్ ఎనర్జీ రెగ్యులేటరీ కమిషన్ సభ్యుడిగా, కృష్ణ ఆర్స్‌ను పెరూలో అమెరికా రాయబారిగానూ నియమిస్తూ అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన ఆదేశాలను సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఐరాసలో అమెరికా దౌత్యవేత్త హోదా పొందిన నిక్కీ హేలీ తరువాత ఆస్థాయి హోదా పొందిన రెండో భారతీయ అమెరికన్ కృష్ణ అర్స్.
మరోవైపు ఇటీవల జోరుగా కొనసాగుతున్న వైట్‌హౌస్ పునర్వ్యవస్థీకరణలో తాజాగా మరో వ్యక్తిపై వేటు పడింది. వైట్ హౌస్ కు చెందిన ఇంటెలిజెన్స్ డైరెక్టర్, ట్రంప్ జాతీయ భద్రతా సహాయకుడు ఎజ్రా కొహెన్-వాట్నిక్ ను తొలగించారు. అయితే ఆయనను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో వైట్‌హౌస్ వెల్లడించలేదు. మార్చి నెలలో ఆందోళనలు తలెత్తినపుడు కొహెన్ వాట్నిక్ స్థానంలో మెక్‌మాస్టర్‌ను నియమించాలని భావించారు. అయితే ఆ సమయంలో ట్రంప్ తో మాట్లాడి తన పదవిని కాపాడాల్సిందిగా ట్రంప్ అత్యున్నత సలహాదారులను వాట్నిక్ కోరారు. ఎజ్రా మరో పదవిలో వుండి జాతీయ భద్రతకు విశేషమైన సేవలందించగలరని భావిస్తున్నట్లు ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు జనరల్ మెక్ మాస్టర్ విశ్వాసం వ్యక్తం చేశారని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎజ్రా కొహెన్ నాయకత్వంలో జాతీయ భద్రతా మండలిలోని ఇంటెలిజెన్స్ విభాగం చాలా బాగా పనిచేసిందని జనరల్ మెక్‌మాస్టర్ అభినందించారు. అయితే ఇప్పుడు కొహెన్ వాట్నిక్ కు కొత్తగా ఇవ్వబోయే పదవి ఏమిటనేది వివరాలు వెల్లడి కాలేదు.
ఇదిలాఉండగా...ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం గురించి తలెత్తిన సందేహాలతో విసిగిపోయిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆఫ్ఘన్ లోని అమెరికా సైనిక కమాండర్ ను వెంటనే తొలగించాల్సిందిగా సూచించినట్లు అధికారులు తెలిపారు. ఆఫ్ఘన్ లో గత 16ఏళ్ళుగా తాలిబన్ పై పోరాడుతున్నా ఇంతవరకు ముగింపనేది కనుచూపు మేరలో కనిపించకపోవడానికి గల కారణాలపై సమాచారం అందించాల్సిందిగా గత నెల 19న వైట్ హౌస్ లో జరిగిన సమావేశంలో ట్రంప్ తన జాతీయ భద్రతా సలహాదారులను కోరారు. ఆఫ్ఘన్‌లో అమెరికా కమాండర్ జనరల్ జాన్ నికొల్సన్ ను తొలగించే విషయాన్ని పరిశీలించాలని రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ - జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జోసెఫ్ డన్ ఫోర్డ్ లను ట్రంప్ ఆదేశించారు. ఆఫ్ఘన్ యుద్ధంలో అమెరికా ఓడిపోయేలా సైన్యం వ్యవహరిస్తోందని ట్రంప్ సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కొంతమంది అధికారులు అక్కడనుండి వెళ్ళిపోవడం గమనార్హం.