Begin typing your search above and press return to search.

ట్రంప్ బిల్లుకు స‌భ షాక్‌..7వేల మంది మ‌నోళ్ల‌పై ప్ర‌భావం

By:  Tupaki Desk   |   17 Feb 2018 7:17 AM GMT
ట్రంప్ బిల్లుకు స‌భ షాక్‌..7వేల మంది మ‌నోళ్ల‌పై ప్ర‌భావం
X
శ‌ర‌ణార్థులు....అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు అస్స‌లు న‌చ్చ‌ని ప‌దం. వ‌ల‌స‌దారుల‌న‌యినా... డ్రీమ‌ర్స్ పేరుతో అనుమ‌తితో చిన్న‌త‌నంలో త‌ల్లిదండ్రుల వెంట‌ వ‌చ్చిన వారయిన పేరు ప్ర‌స్తావించ‌గానే ట్రంప్ నిప్పులు చెరుగుతుంటారు. అయితే ఇదే విష‌యంలో ట్రంప్‌ సర్కార్‌ కు ఆ దేశ ఎగువ‌స‌భ‌లోచుక్కెదురైంది. త‌ద్వారా ఈ నిర్ణయం వల్ల దాదాపు 7000 మంది ఇండియన్ అమెరికన్లతో సహా మొత్తం 18,00,000 మంది భవిష్యత్తు దెబ్బతినే ప్ర‌మాదం ఎదురుకానుంది.

అమెరికా వలస విధానాల్లో సవరణలు ప్రతిపాదిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నూ తనంగా తెచ్చిన ఇమ్మిగ్రేషన్ బిల్లును ఎగువసభ తిరస్కరించింది. దీంతో అమెరికాలో నివసిస్తున్న దాదాపు 18 లక్షల మంది స్వాప్నికుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. సెనేట్‌లో బిల్లు ఆమోదానికి 60 ఓట్లకు బదులు 39 ఓట్లు మాత్రమే పడ్డాయి. గ్రీన్‌ కార్డుల జారీలో దేశాలకు కోటా విధించాలన్న ట్రంప్ ప్రతిపాదననూ సెనేట్ తోసిపుచ్చింది. అమెరికా - మెక్సికో మధ్య గోడ నిర్మాణానికి రూ.1.6 లక్షల కోట్లు (25 బిలియన్ డాలర్లు) కేటాయించాలన్న ప్రతిపాదనకు సైతం అడ్డు చెప్పింది. స్వాప్నికులకు దశలవారీగా అమెరికా పౌరసత్వం ఇచ్చేందుకు ఒబామా ప్రభుత్వం డెఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌ హుడ్ అరైవల్స్ (డీఏసీఏ) పథకాన్ని తెచ్చింది.

ట్రంప్ గత సెప్టెంబర్‌ లో ఈ పథకాన్ని ఎత్తివేశారు. దీంతో ఆరు నెలల్లోగా పరిష్కారం చూపాలని ప్రజాప్రతినిధుల సభ(కాంగ్రెస్)కు సూచించింది. లేకుంటే మార్చి 5వ తేదీ నుంచి డ్రీమర్స్ అందరూ దేశబహిష్కరణకు గురవుతారు. దీంతో ఇరుపక్షాలు పలు దఫాలు జరిపిన చర్చల్లో అమెరికాలోని 18 లక్షల మంది డ్రీమర్లకు పౌరసత్వం ఇచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం ఒప్పుకోగా.. అమెరికా - మెక్సికో మధ్య గోడ నిర్మాణానికి ప్రతిపక్షం ఒప్పుకున్నది. పరస్పర ఒప్పందంతో బిల్లును రూపొందించి ఎగువ సభలో ప్రవేశపెట్టినా తిరస్కరణకు గురయ్యాయి.