Begin typing your search above and press return to search.
మన టెకీలను టార్గెట్ చేస్తూ ట్రంప్ తాజా షాక్ ఇదే
By: Tupaki Desk | 21 March 2018 5:07 AM GMTఅమెరికా అధ్యక్షుడు అయింది మొదలు నైపుణ్యవంతులైన భారతీయ ఉద్యోగులు వేధింపు లక్ష్యంగా విధానాలు రూపొందిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ దఫా కాల్ సెంటర్లపై ట్రంప్ సర్కారు నజర్ వేసింది. అమెరికాలోని ట్రంప్ సర్కారు తాజాగా కాంగ్రెస్ లో ప్రవేశపెట్టిన బిల్లు అక్కడి భారతీయుల కాల్ సెంటర్ ఉద్యోగాలకు చేటు చేయనుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.
తాజా బిల్లు ప్రకారం విదేశాలకు చెందిన కాల్ సెంటర్ ఉద్యోగులు తమ ప్రాంతాన్ని తెలియచేయాల్సి ఉంటుంది. దీనితో పాటు తమ కాల్ ను అమెరికాలోని ఓ సర్వీస్ ఏజెంట్ కు బదిలీ చేయమని కోరే హక్కు వారి వినియోగదారులకు లభిస్తుంది. ఓహియోకు చెందిన సెనేటర్ షెర్రాడ బ్రౌన్ ప్రవేశపెట్టి ఈ బిల్లు కాల్ సెంటర్ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ ఇచ్చిన సంస్థల జాబితాను ప్రభుత్వానికి సమర్పించాలని - ఇతర దేశాలకు ఉద్యోగాలివ్వకుండా అమెరికన్ లకు ప్రాధాన్యతనిచ్చే ఫెడరల్ కాంట్రాక్ట్ లకు ప్రాధాన్యతనివ్వాలని ప్రతిపాదించారు. దీర్ఘకాలంగా అమెరికా వాణిజ్య - పన్నుల విధానం దేశీయ వ్యాపారానికి గండి కొడుతూ అమెరికన్లకు రావాల్సిన ఉద్యోగాలను పన్ను క్రెడిట్ ల రూపంలో అమ్ముకుంటున్నారని, ఉత్పత్తులను రెనోసా - మెక్సికో - వుహాన్ - చైనా వంటి దేశాలకు తరలిస్తున్నారని బిల్లు ప్రవేశపెట్టిన బ్రౌన్ విమర్శించారు. ఔట్ సోర్సింగ్ విధానం అమెరికన్ ఉద్యోగుల మెడపై కత్తిలా వేలాడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కమ్యూనికేషన్ వర్కర్స్ ఆఫ్ అమెరికా అనే కమ్యూనికేషన్ - మీడియా కార్మిక సంఘం నిర్వహించిన అధ్యయనం ప్రకారం అమెరికన్ సంస్థలు తమ ఉద్యోగాలను ఎక్కువగా భారత్ - ఫిలిప్పైన్స్ లకు ఔట్ సోర్సింగ్ చేస్తున్నాయని వెల్లడయినట్లు తెలిపింది. అమెరికన్ కంపెనీలు ఈజిప్ట్ - సౌదీ అరేబియా - చైనా - మెక్సికో వంటి దేశాలలో కూడా కాల్ సెంటర్లు ప్రారంభించినట్లు ఈ అధ్యయనంలో వెల్లడయింది. ఈ నేపథ్యంలో అమెరికన్ల కోసం తాము ఈ బిల్లు పెట్టినట్లు బ్రౌన్ తెలిపారు.