Begin typing your search above and press return to search.

భారత్ - చైనా ఘర్షణ : దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికా యుద్ధ నౌకలు !

By:  Tupaki Desk   |   4 July 2020 12:37 PM GMT
భారత్ - చైనా ఘర్షణ :  దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికా యుద్ధ నౌకలు !
X
భారత్ సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా విధ్వంసం సృష్టిస్తున్న చైనా.. అటు జల భాగాలను కూడా పొరుగు దేశాల నుంచి లాక్కునే ప్రయత్నాలు చేస్తోంది. దక్షిణ చైనా సముద్రం లోని పలు దీవులను ఇప్పటికే తన నియంత్రణ లోకి తెచ్చుకున్న చైనా , మరి కొన్ని ప్రాంతాలని తమ ఆధీనం లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. చైనా ప్రాబల్యాన్ని పెంచుకోడానికి చైనా చేయని ప్రయత్నం లేదు. ఇందులో భాగంగా పారాసెల్ దీవులకు సమీపంలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. చైనా చర్యలను అమెరికా సహా పలు దేశాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. భారత్ ‌తో సరిహద్దుల్లో ఘర్షణ.. దక్షిణ చైనా సముద్రంలో విన్యాసాల నేపథ్యం లో అమెరికా తన యుద్ధ నౌకలను దక్షిణ చైనా సముద్రం లోకి పంపుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఫిలిప్పీన్స్ సముద్రం, దక్షిణ చైనా సముద్రంలో యూఎస్ ఎస్ నిమిట్జ్, యూఎస్ ఎస్ రోనాల్డ్ రీగన్ ‌లు సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయని అమెరికా నేవీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జో జీలే అన్నారు. యుద్ధ నౌకలు దక్షిణ చైనా సముద్రంలోకి రావడం వెనుక ఎలాంటి రాజకీయ, ప్రపంచ సంఘటనలకు ప్రతిస్పందన కాదు. ఇండో-పసిఫిక్ అంతటా అమెరికా నౌకాదళ భద్రత, స్థిరత్వం, శ్రేయస్సును ప్రోత్సహించే అనేక మార్గాలలో ఈ అధునాతన సామర్ధ్యం ఒకటి అని తెలిపారు.

ఇదిలా ఉండగా.. వివాదాస్పద సముద్ర జలాల్లో చైనా సైనిక విన్యాసాలు నిర్వహించడం పై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తీవ్రం గా మండి పడ్డారు. దక్షిణ చైనా సముద్రం లోని వివాదాస్పద జలాల్లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సైనిక విన్యాసాలు నిర్వహించి, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందన్న తమ ఆగ్నేయాసియా మిత్రుల వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాం.. డ్రాగన్ చట్ట విరుద్దమైన కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్నాం అంటూ మైక్ పాంపియో శుక్రవారం ట్విట్టర్‌ లో సంచలన వ్యాఖ్యలు చేసారు. అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ సైతం రెండు రోజుల కిందట ఓ ప్రకటన విడుదల చేసింది.