Begin typing your search above and press return to search.
ఆ ఆరు ముస్లిం దేశాలకు ట్రంప్ కొత్త రూల్స్!
By: Tupaki Desk | 29 Jun 2017 1:04 PM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరు ముస్లిం దేశాలపై విధించిన నిషేధాజ్ఞలను అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల పాక్షికంగా పునరుద్ధరించింది. దీంతో ఆ ఆరు ముస్లిం దేశాలకు వీసాలు జారీ చేసేందుకు ట్రంప్ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఆ దేశాల నుంచి వచ్చే ప్రజలు - శరణార్థులు అమెరికాలోని వ్యక్తులు లేదా సంస్థలతో దగ్గరి సంబంధం కలిగి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అత్యంత సన్నిహిత కుటుంబసభ్యులు - లేదా వ్యాపార బంధువు ఉంటేనే అమెరికా రావాలని ట్రంప్ తెలిపారు. అంటే.. తల్లిదండ్రులు - జీవితభాగస్వామి - పిల్లలు - కోడలు - అల్లుడు - తోబుట్టువులు ఇలా వారికి అమెరికా వ్యక్తులతో బంధుత్వం ఉండాలి. అయితే తాతముత్తాతలు - మనవళ్లు - మనవరాళ్లు - అత్త - మామ - మేనల్లుడు - మేనకోడలు - కజిన్స్ - బావ - మరదలు - కాబోయే భాగస్వామి ఇలాంటి బంధుత్వాలను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు.
సిరియా - సూడాన్ - సోమాలియా - లిబియా - ఇరాన్ - యెమన్ దేశాల నుంచి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారికే ఈ నిబంధనలు వర్తిస్తాయని అమెరికా విదేశాంగశాఖ పేర్కొంది. ఈ కొత్త నిబంధనలను సదరు ముస్లిం దేశాల్లోని ఎంబసీలకు పంపించారు. వీసా దరఖాస్తు చేసుకునే వారు కచ్చితంగా తమ సంబంధాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గురువారం నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
పాత్రికేయులు - విద్యార్థులు - లెక్చరర్లు వచ్చినా ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్ లో భాగంగా అమెరికా సందర్శించేందుకు వచ్చినా..ట్రావెల్ బ్యాన్ నుంచి మినహాయింపు ఉంటుందని అమెరికా వెల్లడించింది. అమెరికాలో సంస్థలు లేదా వ్యక్తులతో విశ్వసనీయ సంబంధాలు లేని వ్యక్తులకు అక్టోబర్ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఇప్పటికే వీసా ఇచ్చినవారికి రద్దు చేసే యోచన లేదని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది.
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో ముస్లిం ప్రధాన దేశాల పౌరులు అమెరికా రాకుండా నిషేధాజ్ఞలు విధించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ట్రంప్ ట్రావెల్ బ్యాన్ పై అక్కడి కోర్టులు స్టే విధించాయి. కాగా.. ఈ నిషేధంపై ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు పాక్షికంగా పునరుద్ధరించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/