Begin typing your search above and press return to search.
అఫ్ఘాన్ నుండి తిరిగొచ్చాక తాలిబన్లతో అమెరికా చర్చలు!
By: Tupaki Desk | 9 Oct 2021 6:01 AM GMTఅఫ్ఘానిస్తాన్ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్న తర్వాత మొదటిసారి తాలిబన్లతో చర్చలు జరపబోతున్నట్లు అమెరికా కీలక ప్రకటన చేసింది. అమెరికా శనివారం నుంచి తాలిబన్ లతో తొలి వ్యక్తిగత చర్చలు జరుపుతుందని విదేశాంగ శాఖ తెలిపింది. ఖతార్ రాజధాని దోహాలో అమెరికా ప్రతినిధి బృందం సీనియర్ తాలిబాన్ ప్రతినిధులతో శని, ఆదివారాల్లో సమావేశం అవుతుంది. ఆగస్టులో తాలిబాన్లు అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
దీని తరువాత, అమెరికా అఫ్ఘానిస్తాన్ నుండి తన సైన్యాన్ని ఉపసంహరించుకుంది. తాలిబాన్లు అఫ్ఘానిస్తాన్ ను కైవసం చేసుకున్న తర్వాత వారిద్దరూ ముఖాముఖి కలవడం ఇదే మొదటిసారి. అఫ్ఘానిస్తాన్ ను తాలిబన్లు దక్కించుకున్నాక.. అక్కడ ఎటువంటి భయానక పరిస్థితులు నెలకొన్నాయో ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి. అఫ్గాన్ పరిస్థితులపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తంచేయగా, అమెరికా ఏం చర్చిస్తుందో అనేది ఇప్పుడు ఆసక్తికరం.
అమెరికన్ స్టేట్ డిపార్ట్ మెంట్ ప్రతినిధి ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. మహిళలతో సహా అఫ్ఘాన్ లందరి హక్కుల గురించి ఆలోచించి, అందరి ఆమోదంతో గౌరవప్రదమైన సమగ్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మేము తాలిబాన్ లను ఒత్తిడి చేస్తాము. అఫ్ఘానిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, మానవతా సంక్షోభం ఎదుర్కొంటుంది. ఆ పరిస్థితులు చక్కదిద్దేందుకే మేం ముందుకు వచ్చాం, అని ఆయన చెప్పారు. అయితే, ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ పాలనను అమెరికా గుర్తించడం లేదని అమెరికన్ ప్రతినిధి స్పష్టం చేశారు. అమెరికా పౌరుల తరలింపులో తాలిబాన్లు ఎక్కువగా సహకరించారని అమెరికా చెబుతోంది.
ఆఫ్గనిస్తాన్ లో రెండు దశాబ్దాలపాటు జరుగుగుతున్న యుద్ధం వల్ల అందరూ అలిసి పోయారు. 2001 లో మొదలైన యుద్ధం ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వాన్ని కూలదోసి తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని అమెరికా ఏర్పాటు చేసింది. కొన్ని వేలమంది నాటో దళాలను ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వానికి అండగా పంపింది. కానీ అమెరికా ఆశించినట్లు ఆఫ్గనిస్తాన్ లో పూర్తి స్థాయి శాంతి స్థాపన ఇప్పటికీ కలగానే మిగిలింది. అమెరికా చేతిలో చావుదెబ్బ తిన్న తాలిబన్లు తిరిగి బలం పుంజుకున్నారు. బలగాలను మళ్ళీ కూడదీసుకున్నారు. అది మొదలు ఇప్పటివరకూ ఆఫ్ఘన్ గడ్డ మీద రక్తం పారుతూనే ఉంది. ఆఫ్ఘన్ ప్రభుత్వం మీదా, నాటో దళాలపైనా తాలిబన్ దాడులు సాగుతూనే ఉన్నాయి. 2001 నుంచి ఇప్పటివరకు 2వేల 352 మంది అమెరికా సైనికులు మరణించారు. నాటో దళాలు నష్టపోయింది దీనికి అదనం. రెండు దశాబ్దాల యుద్ధం ఆఫ్ఘన్ ప్రజల జీవితాన్ని చిన్నభిన్నం చేసింది. తాలిబన్ల అణచివేత నుంచి మాత్రం ఆఫ్ఘన్ ప్రజలు బయట పడ్డారు. కానీ … శాంతి, అభివృద్ధి మాత్రం గగన కుసుమాలుగానే మిగిలిపోయాయి.