Begin typing your search above and press return to search.
పాక్ తో మన అణుయుద్ధానికి రంగం సిద్ధమైందా?
By: Tupaki Desk | 28 Nov 2017 4:23 AM GMTపొరుగునే ఉన్నప్పటికీ ఉగ్రవాదంతో ఒక దేశం - సరిహద్దతు ఆక్రమణలతో - కవ్వింపు చర్యలతో మరో దేశం భారతదేశానికి సృష్టిస్తున్న ఇబ్బందుల నేపథ్యంలో యుద్ధం తప్పదా? ఇండియా - పాకిస్థాన్ - చైనా.. మధ్య ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ఆ దేశాల మధ్య అణు యుద్ధం వచ్చే అవకాశాలున్నాయా ? అంటే పశ్చిమ దేశాలు అవుననే అంటున్నాయి. వాటిల్లో ఆ టెన్షన్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దక్షిణ ఆసియా దేశాల్లో ఆకాశం ఊడిపడే ఛాన్సు ఉందని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. కానీ వాషింగ్టన్ కు చెందిన అట్లాంటిక్ కౌన్సిల్ సంస్థ మాత్రం ఓ క్లారిటీ ఇచ్చింది. ఇండియా - పాకిస్థాన్ మధ్య అణ్వాయుధ యుద్ధం జరగదని తేల్చేసింది.
అట్లాంటిక్ కౌన్సిల్ లోని దక్షిణాసియా నిపుణులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీ - ఇస్లామబాద్ - బీజింగ్ లో జరిగిన సెమినార్ ల ఆధారంగా కౌన్సిల్ ఈ నిర్ణయానికి వచ్చింది. భారత్ - పాక్ - చైనా మధ్య తీవ్ర శత్రుత్వం ఉన్నా.. ఆ దేశాల మధ్య వర్తకం బాగానే ఉందని ఆ సంస్థ తెలిపింది. భారత ఉప ఖండంలో అణు యుద్ధం రావచ్చు అని వస్తున్న వాదనలకు ఆధారాలు లేవని ఆ సంస్థ వెల్లడించింది. చైనా - భారత్ లో జాతీయవాదం దూకుడుగా ఉందన్నారు. ఈ మూడు దేశాల్లోనూ అణ్వాయుధ నిర్ణయం మిలిటరీ చేతుల్లో లేదని, ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి, ఆ భయం అవసరం లేదన్నారు. భారత్ - పాక్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నా.. వాళ్లేమీ అణు పరీక్షలు నిర్వహించడం లేదని అట్లాంటిక్ కౌన్సిల్ అభిప్రాయపడింది. చైనా కూడా తన వార్ హెడ్స్ ను వాడడం లేదని పేర్కొది. ప్రస్తుత పరిస్థితి ప్రకారం చూస్తే..ఇప్పుడేమీ అణు యుద్ధం రాదని తెలిపింది.