Begin typing your search above and press return to search.
యూరప్ వాసులకి అమెరికాలో నోఎంట్రీ .. స్పష్టం చేసిన డొనాల్డ్ ట్రంప్
By: Tupaki Desk | 12 March 2020 6:50 AM GMTకరోనా వైరస్ ప్రపంచాన్ని భయంతో వణికిపోయేలా చేస్తుంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఒక్కొక్క దేశానికీ వ్యాప్తిచెందుతూ , ప్రపంచం మొత్తం పాకుతుంది. ఈ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ముందుజాగ్రత్త చర్యలుగా అమెరికా, ఇండియాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. యూరప్ లోని అన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధాన్ని విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. యూరప్ లో కరోనా భాదితుల సంఖ్య రోజు రోజుకి భారీగా పెరిగిపోతున్న నేపథ్యం లో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ కఠిన నిర్ణయానికి మరో ప్రధాన కారణం.. అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ సోకి 37 మంది ప్రాణాలు కోల్పోగా, 1,015 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో విదేశాల నుంచి వచ్చేవారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నది. యూరప్ నుంచి వచ్చే అన్నిదేశాలపై నిషేధం విధించిన అందులో నుండి బ్రిటన్ కు మాత్రం మినహాయింపు ఇచ్చింది. నేటి నుంచి 30 రోజుల పాటు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని వైట్ హౌస్ ప్రకటించింది. ఇది కాస్తంత కఠినమైన నిర్ణయమే అయినా, తప్పనిసరి అని ట్రంప్ ఈ సందర్భం గా వ్యాఖ్యానించారు. అయితే అమెరికా తిరిగి వచ్చే ప్రయాణికులు.. స్రీన్ టెస్ట్ లు రెండు, మూడు ఆపై ఎక్కువ సార్లు చేయించుకొని, కరోనా వైరస్ నెగిటివ్ వచ్చిన వారిని అనుమతిస్తామని తెలిపారు.ఈ సమయంలోనే కరోనా వైరస్ నివారించడంలో యూరొపియన్ యూనియన్ విఫలమైందని ట్రంప్ ఆరోపించారు. వైరస్ ప్రబలుతోన్న తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోలేదని అన్నారు.
ఇక ఇదే సమయంలో కరోనాపై జాగ్రత్తలు తీసుకుంటున్న భారత్, గతంలో జారీ చేసిన అన్ని టూరిస్ట్ వీసాలనూ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 19 వరకూ ఈ నిర్ణయం అమలులో ఉంటుందని బీజేపీ సర్కారు ప్రకటించింది. మార్చి 13 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని వైద్య ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి తెలిపింది. మొత్తంగా ప్రపంచంలోని పలు దేశాలు , కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యం లో ఇతర దేశాల వారిని , తమ దేశానికీ కొన్ని రోజుల పాటు రాకుండా నిషేధిస్తున్నాయి.