Begin typing your search above and press return to search.

ఉగ్రదాడి పై భారత్ వద్ద తిరుగులేని ఆధారాలు

By:  Tupaki Desk   |   28 Feb 2019 10:32 AM GMT
ఉగ్రదాడి పై భారత్ వద్ద తిరుగులేని ఆధారాలు
X
ఓ వైపు సరిహద్దుల్లో యుద్ధం చేస్తూ.. మరో వైపు శాంతిమంత్రం జపిస్తూ పాకిస్తాన్ ఆడుతున్న డబుల్ గేమ్ వర్కవుట్ కావట్లేదు. ప్రపంచ దేశాల నుంచి పాక్ కు మద్దతు లభించడం లేదు. సరైనా ఆధారాలు చూపిస్తే పుల్వామా ఘటనపై విచారణకు సిద్ధమని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే భారత్ తిరుగులేని ఆధారాలను పాకిస్తాన్ కు పంపించింది. 40మందికిపైగా భారత జవాన్లను హతమార్చిన తర్వాత ఉగ్రవాదులతో జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ మాట్లాడిన టేపులను పాక్ అధికారులకు భారత్ పంపించింది. ‘పుల్వామా దాడిని సమర్థవంతంగా చేసినందుకు ఉగ్రవాదులకు అభినందనలు’ అని మసూద్ పేర్కొన్న ఆడియోను ఇచ్చారు. తాను అప్పగించిన పనిని విజయవంతంగా నిర్వహించింనందుకు ప్రశంసలు అని ఆడియోలో మసూద్ స్వయంగా మాట్లాడిన ఆడియో టేపులను పాకిస్తాన్ కు ఇచ్చిన భారత్.. తక్షణమే మసూద్ పై చర్యలు తీసుకోవాలని అల్టీమేటం జారీ చేసింది.

కాగా మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని తాజాగా ఐక్యరాజ్యసమితిలో అమెరికా - బ్రిటన్ - ఫ్రాన్స్ లు కోరాయి. మసూద్ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించాలని.. ఆయన ఆస్తులను సీజ్ చేయాలని పదిహేను సభ్యులతో కూడిన భద్రతా మండలి శాంక్షన్స్ కమిటీకి విజ్ఞప్తి చేశాయి. అయితే ఈ విషయంలో రష్యా, చైనా ఇంకా స్పందించలేదు. ఏకాభిప్రాయం కోసం మార్చి 13న ఐరాసాలో చర్చిస్తారు. భారత డిమాండ్ పై చైనా ప్రతికూలంగా స్పందిస్తుందా లేదా? చైనా నిర్ణయం ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.