Begin typing your search above and press return to search.
పాక్ విషయంలో అమెరికా ముందు జాగ్రత్త!
By: Tupaki Desk | 8 Oct 2016 4:41 AM GMTఉగ్రవాదం విషయంలో, అందుకు పాకిస్థాన్ సహకరిస్తున్న విషయంలో ఇప్పటికే ఫైర్ మీదున్న అమెరికా ఎప్పటికప్పుడు ఈ విషయాలను ఖండిస్తూనే వస్తుంది. మొన్నటి వరకూ పాక్ విషయంలో కాస్త అటూ ఇటూగా మాట్లాడిన ఈ అగ్రరాజ్యం, ఉరీ ఉగ్రదాడి అనంతరం కాస్త గట్టిగానే వ్యాఖ్యానిస్తుంది. ఇదే సమయంలో పాక్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించే బిల్లు విషయంలో కూడా సానుకూల స్పందన వస్తుందన్న వార్తన నేపథ్యంలో అమెరికా ఈ విషయంలో తన వాయిస్ పెంచింది. భవిష్యత్ ప్రణాళికల సంగతులు తెలియవు కానీ... తాజాగా తమ పౌరులకు మాత్రం పాక్ విషయంలో కొన్ని హెచ్చరికలు చేసింది అమెరికా.
ఎంతో అత్యవసరమైతే తప్ప పాకిస్థాన్ కు ప్రయాణం పెట్టుకోవద్దని అమెరికా తన పౌరులకు తాజాగా హెచ్చరికలు జారీచేసింది. పాకిస్థాన్ అంతటా విదేశీ - స్వదేశీ తీవ్రవాద సంస్థలు పుష్కలంగా ఉన్నాయని, అవి అమెరికా పౌరులకు పెనుముప్పు కానున్నాయని అమెరికా తమ పౌరులను హెచ్చరించింది. వేర్పాటు వాద దాడులతో సహా అక్కడ హింస కొనసాగుతోందని అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో ప్రకటించింది. పాకిస్థాన్ లో పౌరవిమానయాన సేవలకు కూడా ముప్పు పొంచిఉందని ఎఫ్ ఏఏ (ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్) హెచ్చరికలు జారీ చేసినట్లు అమెరికా విదేశాంగశాఖ వెల్లడించింది. ఇదే సమయంలో దక్షిణాసియాలో ఉగ్రవాదుల స్థావరాలను నిర్మూలించేందుకు ఆ ప్రాంతంలోని దేశాలతో కలిసి పనిచేసేవిషయంలో తాము ముందుంటామని అమెరికా మరోసారి ప్రకటించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/