Begin typing your search above and press return to search.

ట్రంప్ కంపును మ‌నపైకి తోస్తున్న అమెరికా

By:  Tupaki Desk   |   4 Jun 2017 6:30 AM GMT
ట్రంప్ కంపును మ‌నపైకి తోస్తున్న అమెరికా
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు - మొండి ఒక‌ద‌శ‌లో మూర్ఖ‌పు నిర్ణ‌యాల‌తో ప్ర‌పంచం అంతా వ‌ణికిపోతుంటే త‌మ నాయ‌కుడికి వంత పాడే కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న టీం చేప‌ట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. వాతావరణ మార్పులకు సంబంధించి ఐరాస ఆధ్వర్యంలో కుదిరిన పారిస్‌ ఒప్పందం నుంచి తప్పుకుంటామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలను తిప్పికొట్టే ప్రయత్నాన్ని ప్రారంభించింది. ట్రంప్ ప్రకటనను అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ అధికారి స్కాట్‌ ప్రూట్‌ సమర్థించారు. పారిస్‌ వాతావరణ ఒప్పందంలో భారత్‌ - చైనా లాంటి దేశాలకు గ్రీన్‌ హౌస్‌ ఉద్గారాలపై ఎటువంటి జవాబుదారీతనం లేదని అమెరికా త‌ర‌ఫున ఆరోపించారు.

ప్రస్తుత పారిస్‌ ఒప్పందం వల్ల 2030 వరకు చైనా ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు అదే విధంగా భారత్‌ కు వేల కోట్ల డాలర్ల మేరకు ఆర్థిక సాయాన్ని అందించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే రష్యాకు గ్రీన్‌ హౌస్‌ ఉద్గారాలు వెదజల్లేవిధంగా రాయితీని కల్పించారని ఆయన వెల్లడించారు. పారిస్‌ ఒప్పందం మేరకు చైనా - భారత్‌ కు వాతావరణ మార్పులకు సంబంధించి ఎలాంటి జవాబుదారీతనం లేదని ఆరోపించారు. పారిస్‌ ఒప్పందంపై 150కు పైగా దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందానికి సంబంధించి అమెరికాలోనూ 26 నుంచి 28 శాతం మేరకు గ్రీన్‌ హౌస్‌ ఉద్గారాలను తగ్గించుకోవాల్సి ఉంటుంది అయితే దీని వలన అమెరికాకు ఎలాంటి ప్రయోజనం ఉండబోదన్నారు.

పారిస్‌ ఒప్పందం నుంచి అమెరికా బయటకు వస్తుందని ట్రంప్‌ ప్రకటించడాన్ని సాహసోపేత నిర్ణయంగా స్కాట్‌ అభివర్ణించారు. అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలను గౌరవిస్తునే అమెరికా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించారని చెప్పారు. దీనిపై గత కొన్ని వారాలుగా భిన్నాభిప్రాయాలను ట్రంప్‌ విన్నారు. అధ్యయనం చేశారు. అయితే దేశానికి లబ్ది చేకూర్చని పారిస్‌ ఒప్పందం నుంచి బయటకు రావడమే మంచిదన్న నిర్ణయాన్ని తీసుకున్నారని ప్రశంసించారు. 1990ల నుంచే గ్రీన్‌ హౌస్‌ ఉద్గారాలను తగ్గించేందుకు అమెరికా అనేక చర్యలను చేపడుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అధునాతన టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఇటువంటి చర్యలను చేపట్టినట్టు చెప్పారు. సహజవాయువు పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని అమెరికా ముందుగా చేపట్టింది. చైనా - భారత్‌ లు కూడా ఈ పరిజ్ఞానాన్ని అమెరికా నుంచి నేర్చుకొన్నాయని తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో అమెరికా అనుసరించిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర దేశాలు కావాలంటే అందివ్వడానికి సిద్ధంగా ఉన్నామని, మాటల్లో కన్నా చేతలద్వారానే అమెరికా తన చిత్తశుద్ధిని నిరూపించుకుందని స్కాట్ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/