Begin typing your search above and press return to search.
ఒలింపిక్సులో 1000 గోల్డ్ మెడల్స్..
By: Tupaki Desk | 14 Aug 2016 12:32 PM GMT ఒలింపిక్సు చరిత్రలో అమెరికా ఎవరికీ అందనంత ఎత్తుకు చేరింది. సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు మొత్తం 2400 పతకాలు సాధించి అగ్రరాజ్యమన్న పేరు నిలబెట్టకుంది. అమెరికా సాధించిన 2400 మొత్తం పతకాల్లో 1004 బంగారు పతకాలు ఉండడం విశేషం. అమెరికా తరువాత ఎవరూ దరిదాపుల్లోనూ లేరు. రెండో స్థానంలో ఉన్న రష్యా ఖాతాలో 572 బంగారు పతకాలున్నాయి. ప్రస్తుత రియో ఒలింపిక్ లోనూ అమెరికా అథ్లెట్స్ పతకాల పంట పండిస్తున్నారు. రియోలో అమెరికా స్వర్ణ పతకాలు 24 - రజత పతకాలు 18 - కాంస్య పతకాలు 18 సాధించి మొత్తం 60 పతకాలతో పతకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది.
రియోలో అడుగు పెట్టే వేళకు - ఇన్నాళ్లు వివిధ దేశాలలో జరిగిన ఒలింపిక్స్ లో మొత్తం 977 స్వర్ణాలను సొంతం చేసుకుని వున్న అమెరికా - ప్రస్తుత పోటీలు దాదాపు సగం ముగిసేసరికి తన మొత్తం స్వర్ణాల సంఖ్యను ఇంకా పెంచుకోనుంది.. మహిళా స్విమ్మర్లు కాథలీన్ బేకర్ - లిల్లీ కింగ్ - డాన్ వాల్మీర్ - సిమోల్ మాన్యుల్ ల జట్టు 4x100 మీటర్ల మెడ్లే రిలే విభాగంలో స్వర్ణం సాధించడంతో అమెరికా వెయ్యి బంగారు పతకాల మైలురాయిని దాటింది. ఆపై పురుషుల 4X100 రిలేలోనూ మరో నాలుగు స్వర్ణాలు అమెరికా ఖాతాకు చేరాయి. కాగా, ఈ మొత్తం పతకాల్లో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో 323 స్వర్ణాలు - ఈత కొలనులో 246 స్వర్ణాలు అమెరికాకు దక్కడం గమనార్హం. ఒలింపిక్స్ చరిత్రలో మరే దేశమూ అమెరికాకు దరిదాపుల్లో కూడా లేదు.
ఒకట్రెండు అంశాల్లో తప్ప దాదాపు ప్రతి విభాగంలోనూ అమెరికా పతకాలు సాధిస్తూ వస్తోంది. ఇటీవల కాలంలో క్రీడారంగంలో చైనా ఆధిపత్యం పెరుగుతున్నా అది కొన్ని క్రీడలకే పరిమితమవుతోంది. మరోవైపు అమెరికా మాత్రం అత్యధిక క్రీడల్లో దూసుకుపోతూ పతకాల వేటలోనూ రికార్డులు సృష్టిస్తోంది.