Begin typing your search above and press return to search.

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో పార్టీలు ఖర్చు.. అక్షరాల రూ. 13,66,14,60,05,000

By:  Tupaki Desk   |   8 Nov 2022 4:49 AM GMT
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో పార్టీలు ఖర్చు.. అక్షరాల రూ. 13,66,14,60,05,000
X
భారత్ లోనే కాదు అమెరికాలోనూ ఎన్నికల ఖర్చు కోట్లు దాటుతోంది. ఇండియాను మించి ఖర్చు చేస్తున్నారు. ఒక్క మునుగోడు ఎన్నికకే ఏకంగా రూ.1000 కోట్ల వరకూ పార్టీలు ఖర్చు చేసిన పరిస్థితి. అలాంటిది అగ్రరాజ్యం అమెరికాలో ఇంకా ఎన్ని కోట్లు ఖర్చు చేస్తారో అర్థం చేసుకోవచ్చు.

ఇది అమెరికాలో మధ్యంతర ఎన్నికల సీజన్. ఆశ్చర్యకరంగా అన్ని రాజకీయ పార్టీలు డబ్బు ఖర్చు చేయడంలో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి.

భారతదేశంలో లాగా ఓటర్లకు ఇక్కడ డబ్బులు పంపిణీ చేయరు. కానీ ఎస్ఎంఎస్ ప్రచారాలు, బిల్‌బోర్డ్‌లు, వీధి వైపు సైన్‌బోర్డ్‌లు, టీవీ ప్రకటనలు, చెల్లింపు ఇంటర్వ్యూలు, దినపత్రికలలోని కథనాలు, పోస్ట్ బాక్స్‌లపై డ్రాప్ చేయడానికి ముద్రించిన కరపత్రాలు, సోషల్ మీడియా ప్రమోషన్‌లు, ఈవెంట్‌లకు ఖర్చు చేయడం. ప్రెస్మీట్లు కోసం ఇదంతా వెచ్చిస్తున్నారు.

ఎంతలా అంటే అమెరికా కరెన్సీలో 16.7 బిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నారు. ఇదే మన రూపాయాల్లో చెప్పాలంటే రూ. 13,66,14,60,05,000. ఇన్ని లక్షల కోట్లను ప్రచారం కోసం వాడుతున్నారంటే అమెరికా ఎన్నికలు ఎంత ఖరీదైనవో అర్థం చేసుకోవచ్చు.

ఈ భారీ మొత్తంలో రిపబ్లికన్ ఖర్చునే ఎక్కువ. డెమొక్రాట్లు $3.9 బిలియన్లు ఖర్చు చేస్తుంటే.. ప్రతిపక్షంలో ఉన్న రిపబ్లికన్లు $4.6 బిలియన్లు భారీగా వెచ్చిస్తున్నారు. మిగిలినవి ఇతర పార్టీలు.. స్వతంత్రుల మధ్య పంచబడతాయి.

అన్నింటికంటే ఎక్కువగా మీడియాకే ఖర్చు చేస్తున్నారు. గత సంవత్సరాలతో పోలిస్తే ఇది చాలా పెద్ద మొత్తంగా చెబుతున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడం కూడా ఈ విపరీతమైన వ్యయానికి కారణమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.