Begin typing your search above and press return to search.
అమెరికా పక్కలో ‘న్యూయార్క్’ బాంబ్
By: Tupaki Desk | 27 March 2020 5:40 AM GMTఅమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. తాజాగా కరోనా కేసుల్లో చైనాను అమెరికా దాటేసింది. ఆ దేశంలో మరణ మృదంగం కూడా వినిపిస్తోంది. ఇప్పటివరకు అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82547కు చేరింది. అమెరికాలో తాజాగా నిన్న ఒక్కరోజే ఏకంగా 13785మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 82వేలు దాటింది.ఇప్పటివరకు కరోనా కేసుల్లో చైనా టాప్ ప్లేసులో ఉండేది. ఆ దేశంలో 81285 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు చైనాను అమెరికా దాటేయడం కలకలం రేపుతోంది.
అమెరికా మొత్తం కేసుల్లో 50శాతం న్యూయార్క్ నగరంలోనే నమోదుకావడం కలకలం రేపుతోంది. ఇప్పుడు అమెరికాలోనే అంటువ్యాధి కరోనా వైరస్ కు కేంద్రంగా న్యూయార్క్ మారింది. న్యూయార్క్ వాసులకు పరీక్షల్లో చాలా మందికి పాజిటివ్ అని తేలుతోంది. రోజుకు 18650 పరీక్షలు చేస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా అన్ని పరీక్షల్లో 25శాతం న్యూయార్క్ లోనే నమోదుకావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
న్యూయార్క్ లో కరోనా లక్షణాలతో ఏకంగా 6406మంది అత్యవసర కాల్ సర్వీస్ 911కు కాల్స్ చేయడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా మారింది. డబ్ల్యూటీసీ టవర్స్ పై చేసిన దాడిలో మరణించిన వారి కంటే కూడా ఈ సంఖ్య ఎక్కువ కావడం గమనార్హం.
న్యూయార్క్ లో వైద్య సేవల కొరతకు భయపడి కరోనా అనుమానితులు ఇతర నగరాలకు పారిపోతున్నారు. దీంతో అమెరికా వ్యాప్తంగా ఈ వ్యాధి వ్యాపిస్తోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని లాక్ డౌన్ ప్రకటించడంలో ఆలస్యం చేస్తున్నారు. ఇది ఆలస్యమైనకొద్దీ అమెరికాలో కరోనా వ్యాప్తి మరణాల సంఖ్య పెరుగుతుండడం కలవరం రేపుతోంది.