Begin typing your search above and press return to search.

మ‌న‌ల్ని కెలికిన చైనాకు అమెరికా షాక్‌!

By:  Tupaki Desk   |   3 July 2017 10:21 AM GMT
మ‌న‌ల్ని కెలికిన చైనాకు అమెరికా షాక్‌!
X
స‌రిహ‌ద్దుల విష‌యంలో త‌న‌కో న్యాయం, పొరుగున ఉన్న దేశానికి ఇంకో న్యాయం అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే చైనాకు తాజాగా గ‌ట్టి పంచ్ ఎదుర‌యింది. సిక్కిం స‌రిహ‌ద్దుల్లో త‌న సైన్యం ద్వారా భార‌త‌దేశాన్ని ఇబ్బంది పెడుతున్న చైనాకు అచ్చూ అలాంటి ప‌రిస్థితులే ఎదుర‌వుతున్నాయి. వివాదాస్ప‌ద ద‌క్షిణ చైనా స‌ముద్రంలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయని వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఆ ప్రాంతానికి యుద్ధ నౌక‌ల‌ను పంపిన అమెరికా త‌మ‌ను రెచ్చ‌గొడుతున్న‌ద‌ని చైనా ఆరోపించింది. రాజ‌కీయ, మిలిట‌రీ క‌వ్వింపున‌కు అమెరికా పాల్ప‌డుతున్న‌ద‌ని చైనా పేర్కొంది.

పార‌సెల్ దీవుల ద‌గ్గ‌ర ఉన్న ట్రీట‌న్ ఐలాండ్‌ కు అమెరికాకు చెందిన యుద్ధ నౌక యూఎస్ ఎస్ స్టీథెమ్ వెళ్లింది. అయితే యుద్ధ నౌక ఆ ప్రాంతానికి వెళ్ల‌డం ప‌ట్ల చైనా సీరియ‌స్‌ గా ఉంది. వెంట‌నే ఆ వివాద‌స్ప‌ద ప్రాంతానికి చైనా కూడా త‌మ యుద్ధ నౌక‌ల‌ను - జెట్ విమానాల‌ను పంపింది. ఇరు దేశాల అధ్య‌క్షులు జీ జిన్‌ పింగ్‌ - ట్రంప్ ఫోన్‌ లో మాట్లాడ‌టానికి ముందే ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. కొరియా స‌మీప దీవుల‌ను డీన్యూక్లియ‌రైజ్ చేయాల‌న్న ఉద్దేశంతో అమెరికా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ద‌క్షిణ చైనా స‌ముద్ర ప్రాంతంలో చైనా భారీ ఆయుధ బాండాగారాన్ని నిర్మిస్తోంది. అయితే దీన్ని అమెరికా వ్య‌తిరేకిస్తోంది. ట్రీట‌న్ ఐలాండ్‌ కు సుమారు 12 నాటిక‌ల్ మైళ్ల దూరం వ‌ర‌కు అమెరికా యుద్ధ నౌక వెళ్లింది. అయితే అలా యుద్ద నౌక ప్ర‌యాణించ‌డాన్ని చైనా త‌ప్పుపట్టింది. ద‌క్షిణ ఆసియా దేశాల‌కు ద‌క్షిణ చైనా స‌ముద్ర ప్రాంతం కీల‌క‌మైంది. అది ఆ దేశాల‌కు షిప్పింగ్ రూట్‌. అక్క‌డ మ‌త్స్య సంప‌ద కూడా ఎక్కువే. అంతేకాదు ఇంధ‌న వ‌న‌రులు కూడా బోలెడు ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాన్ని చేజిక్కించుకోవాల‌ని చైనాతో పాటు ద‌క్షిణ ఆసియా దేశాలు ద‌క్షిణ చైనా స‌ముద్ర తీర ప్రాంతంపై క‌న్నేశాయి. ఇదే అదునుగా అమెరికా కూడా ఆ ప్రాంతంలో త‌న ప‌ట్టును సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తూ చైనాకు షాక్ ఇస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/