Begin typing your search above and press return to search.
బోల్ట్ అస్త్రసన్యాసం చేస్తున్నాడు!
By: Tupaki Desk | 27 Jun 2017 3:54 AM GMTప్రపంచంలో ఎక్కడ ఆథ్లెటిక్స్ జరిగినా... అందరి కళ్లు ఒక్కరి కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఆ ఒక్కరు ట్రాక్ పైకి వచ్చాడంటే... ప్రత్యర్థులంతా పరుగు ప్రారంభం కాకముందే ఓటమిని అంగీకరించాల్సిందే. నిజమే... జమైకా చిరుతగా నిక్ నేమ్ పడిపోయిన జమైకా దేశానికి చెందిన పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్... పరుగు ప్రారంభించాడంటే పోటీదారులంతా అతడి వెనుకే పరుగెట్టగలరు గానీ... అతడిని దాటి అతడి కంటే ముందుగా లక్ష్యాన్ని చేరలేదు. అందుకేనేమో అతడిని అంతా జమైకా చిరుతగా పిలుచుకుంటారు.
ఇప్పటిదాకా జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో అతడి గెలుచుకున్న పతకాల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇక ప్రపంచ స్థాయి క్రీడల్లో అతడు ఏకంగా 11 పతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అయినా ఇప్పుడు బోల్ట్ గురించి ఎందుకనేగా మీ ప్రశ్న. వచ్చే లండన్ ఒలింపిక్స్ లో అతడు కనిపించడు. ఎందుకంటే... ప్రస్తుతం చెక్ రిపబ్లిక్ లో జరుగుతున్న ఐఏఏఎఫ్ వరల్డ్ ఛాలెంజ్ లో పాల్గొనేందుకు వచ్చిన అతడు... ఇదే తన చివరి పరుగు పోటీ అని తేల్చి చెప్పేశాడు.
నిషేధిత ఉత్ప్రేరకాలు వాడి విమర్శలు ఎదుర్కొన్న తర్వాత కూడా తన కెరీర్ లో అద్భుతమైన ప్రతిభ కనబరచిన బోల్ట్ నోటి నుంచి ఈ మాట వస్తుందని ఏ ఒక్కరూ ఊహించి ఉండరు. అయితే ఇప్పటిదాకా తాను సాగించిన ప్రయాణం సంతృప్తికరంగానే ఉందని చెప్పిన బోల్ట్... ఇకపై ట్రాక్ పైకి ఎక్కకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చాడు. కెరీర్ లో ఉత్తాన పతనాలను చూశానని, అయినా పరుగు పోటీలో నెగ్గడమే లక్ష్యంగా తాను ముందుకు సాగానని చెప్పిన అతడు... ఇక రిటైర్ అవుతానంటూ సంచలన ప్రకటన చేశాడు. ఇప్పటిదాకా బరిలోకి దిగిన పోటీలన్నీ కూడా ఎంతో తృప్తినిచ్చాయని చెప్పిన బోల్ట్... ఇకపై తాను పరుగు పోటీలో పాల్గొనబోనని కుండబద్దలు కొట్టేశాడు. అంటే... ఇకపై ఒలింపిక్స్ క్రీడల్లోనే కాకుండా మరెక్కడా కూడా పరుగు పోటీలో బుల్లెట్ లా దూసుకెళ్లే బోల్ట్ ను చూడలేమన్న మాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/