Begin typing your search above and press return to search.
గుడ్ న్యూస్: హెచ్1బీ ప్రీమియం ప్రాసెసింగ్ షురూ
By: Tupaki Desk | 26 Jan 2019 1:03 PM GMTనైపుణ్యవంతులకు అవకాశాల స్వర్గదామంగా మారిన అమెరికా నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. H-1B వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. అన్నికోటాల్లోనూ వీసా దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్ జనవరి 28 నుండి ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఇండియన్ టెకీలకు ఆశలు చిగురించాయి.
పెండింగ్ లో ఉన్న వీసా దరఖాస్తులను పరిశీలించేందుకు గతంలో అమెరికా H-1B వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ను నిలిపేసింది. దీంతో మనదేశానికి చెందిన టెకీల్లో కలవరం ప్రారంభమైంది. ఓవైపు అమెరికాలో సంక్షోభం - మరోవైపు సుదీర్ఘ సమయం గడిచిపోతున్న తరునంలో పఅమెరికా నిర్ణయం కోసం అంతా ఎదురుచూశారు. 2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి H-1B వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ను తిరిగి ప్రారంభించింది.
మాస్టర్స్ కోటాలో ప్రీమియం ప్రాసెసింగ్ దరఖాస్తులతో పాటు రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్(RFE) అందిన వారు దరఖాస్తు చేసుకోవాలని అమెరికా తెలిపింది. 15 రోజుల్లోగా వారి దరఖాస్తులను పరిశీలించాలని అధికారులను కోరింది.
కాగా,స్థానికంగా ఎక్స్ ఫర్ట్స్ కొరత ఉండటంతో US కంపెనీలు నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల కోసం…ప్రతీ ఏడాది 85 వేల H-1B వీసాలను మంజూరు చేసింది. అమెజాన్ - మైక్రోసాఫ్ట్ - గూగుల్ తో పాటు ఇతర కంపెనీలు ఎక్కువగా విదేశీయుల కోసం నియమించిన ఈ వీసాల్లో 70% కంటే ఎక్కువ భారతీయులే ఉన్నారని పలువురు అంటున్నారు.