Begin typing your search above and press return to search.

వామ్మో : వాడిపడేసిన పీపీఈ కిట్లను మళ్లీ అమ్మేస్తున్నారు !

By:  Tupaki Desk   |   28 May 2021 11:30 PM GMT
వామ్మో : వాడిపడేసిన పీపీఈ కిట్లను మళ్లీ అమ్మేస్తున్నారు !
X
కరోనా మహమ్మారి దెబ్బకి దేశం మొత్తం అల్లాడిపోతుంటే , ఈ సమయంలో కూడా కొందరు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. అక్రమంగా మందులు, ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముతూ బాగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇక కొందరైతే మరి దిగజారి ఒకసారి వాడిన పీపీఈ కిట్లను మళ్లీ వాష్ చేసి అమ్ముతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబందించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. వాడిపారేసిన మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్లను తిరిగి అమ్మెందుకు వాష్ చేస్తున్నారు. కొందరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది.

ఈ ఘటన సాట్నా జిల్లా బర్కెడా గ్రామంలోని బయో మెడికల్ వేస్ట్ డిస్పోజల్ యూనిట్‌ లో బయటపడింది. ఈ వీడియోలో మాస్కులు ధరించిన కొంత మంది, గతంలో వాడిన గ్లోవ్స్, మాస్కులు వాష్ చేస్తూ కనిపించారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకసారి ఒకసారి వాడిన వాటిని జాగ్రత్తగా డిస్పోజ్ చెయ్యాలి. కానీ వీరు మాత్రం వాటిని ఉతికి కొత్తవాటిలా కనిపించేలా వాష్ చేసి మళ్లీ అమ్ముకొని క్యాష్ చేసుకుంటున్నారు. ఈ విషయం సాట్నా జిల్లా కలెక్టర్ వద్దకు చేరడంతో ఆయన విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత ఈ కేసును మధ్యప్రదేశ్ పోల్యూషన్ కంట్రోల్ బోర్డుకు బదిలీ చేశారు. ఘటన జరిగిన ప్లాంట్‌ను అధికారులు విజిట్ చేశారు. విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.