Begin typing your search above and press return to search.

పోర్న్ కు పెరుగుతున్న ఆదరణ.. నెమ్మదిగా మెయిన్ స్ట్రీమ్ కు!

By:  Tupaki Desk   |   21 Nov 2019 4:39 AM GMT
పోర్న్ కు పెరుగుతున్న ఆదరణ.. నెమ్మదిగా మెయిన్ స్ట్రీమ్ కు!
X
సంప్రదాయం.. ఆచారవ్యవహారాలు ఇలా ఎన్ని పెద్ద పెద్ద మాటలు చెప్పినా మన దేశంలో హిపోక్రసీ(తెలుగులో కపటత్వం అని చెప్పుకోవాలి) ఎక్కువే. అధికశాతం జనాలు చెప్పేదొకటైతే చేసేది మరొకటి. కులాలు లేవు అని ఎలుగెత్తి చాటుతారు.. కానీ కులం కోసమే కొట్టుకుంటారు. లంచం తప్పంటారు.. ప్రతి చోటా అమ్యామ్యాలు తీసుకుంటారు. ఒకవేళ తీసుకోకపోయినా ఇతరులకు ఇస్తారు. ఇక దేశ భక్తి అని జఫ్ఫా కబుర్లు చెప్తారు పిల్లలను అమెరికాకు పంపుతారు. వీలైతే తామూ అక్కడికి పోయి సెటిల్ అవుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు లక్ష అంశాలు ఉన్నాయి.. వీటిలో పోర్న్ చూడడం కూడా ఒకటి.

మన భారతీయ సమాజంలో నేను పోర్న్ చూస్తాను. నాకు పోర్న్ అంటే ఇష్టం.. నిజానికి నేను ఉదయాన్నే పోర్న్ తో నా రోజు మొదలు పెడతాను అని చెప్పిన ఒక్క వ్యక్తి రామ్ గోపాల్ వర్మ మాత్రమే. అయన వ్యక్తిత్వం.. విపరీత ధోరణులు పక్కన పెడితే పోర్న్ చూస్తానని ఒప్పుకున్నాడు అనేది గుర్తించాల్సిన అంశం. మెజారిటీ జనాలు పోర్న్ చూస్తారు.. కానీ ఎవరూ చూస్తామని ఒప్పుకోరు. ఎవరూ చూడకపోతే పోర్న్ సైట్లు ఇండియాలో టాప్ వెబ్ సైట్స్ లిస్టు లో ఎందుకు ఉంటాయి చెప్పండి? సన్నీ లియోన్ కొన్నేళ్లు గూగుల్ సెర్చ్ లిస్టులో టాప్ ప్లేసులో ఎందుకు ఉంది?

దాదాపు అందరూ చూస్తారు. చూసినట్టు ఒప్పుకోరు బయటకు చెప్పుకోరు. పోర్న్ కు ఆదరణ నానాటికీ పెరుగుతూనే ఉందట. ఎక్స్ క్రిటిక్ అనే పోర్న్ ఇండస్ట్రీ రివ్యూయర్ ఈమధ్యే పోర్న్ ఇండస్ట్రీ ట్రెండ్స్ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడించారు. అయితే ఇవి ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్స్. ఇందులో క్యామింగ్ పట్ల ఆదరణ పెరుగుతోందట. క్యామింగ్ అంటే చాలా అర్థాలు ఉన్నాయి కానీ అందులో ఒకటి.. లైవ్ సెక్స్ స్ట్రీమింగ్. దీనికి విపరీతంగా అదరణ దక్కుతోందట. ఇక మరో అంశం ఏంటంటే 'టాబూ సెక్స్' కు ఆదరణ పెరుగుతోందట. భార్య భర్తల మధ్య తప్ప కుటుంబంలోనే ఇతర వ్యక్తులతో రతి చేయడాన్ని సమాజం హర్షించదు. సరిగ్గా ఇదే నిషేధిత రతి. దీనికే ఆదరణ విపరీతంగా దక్కుతోందట.

ఇదంతా ఇండియాలో లేదు అనుకుంటే పొరపాటే. క్యామింగ్ తెలియని వారు.. ఇన్సెస్ట్ సెక్స్ గురించి తెలియని వారు ఈ జెనరేషన్లో చాలా తక్కువమంది ఉంటారు. ఈ ఇన్సెస్ట్ సెక్స్ చూసే జనాల సంఖ్య భారత దేశంలో కూడా ఎక్కువే.. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్స్ తో రన్ అయ్యే ఇండియన్ సైట్స్ వేలకొద్ది ఉన్నాయి. ఎవరూ చూడనప్పుడు ఆ సైట్లు రన్ చేస్తూ టైమ్ వేస్ట్ చేసుకునే బూతు వ్యాపారవేత్తలు ఎవరూ లేరు.

నిజానికి ఈ పోర్న్ ఇండస్ట్రీ ప్రభావం నెమ్మదిగా ఎంటర్టైన్మెంట్ రంగంపై కూడా కనిపిస్తోందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. సినిమాలలో పెరుగుతున్న సెక్స్ సీన్లు.. అడల్ట్ కంటెంట్ దీని పుణ్యమేనని అన్తున్నారు. ఈ తరం ప్రేక్షకులు పోర్న్ కు పూర్తిగా ఎక్స్ పోజ్ అయి ఉన్నారు కాబట్టే వారిని దృష్టిలో ఉంచుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సెక్స్ కంటెంట్ ఎక్కువగా ఉండే వెబ్ సీరీస్ ను స్ట్రీమింగ్ చేస్తున్నారు. వాటికి భారీగా ఆదరణ దక్కుతోంది.. వెబ్ సీరీస్ పై సెన్సారింగ్ లేకపోవడం ఇలాంటి వెబ్ సీరీస్ లు రూపొందించేవారికి అనుకూలంగా మారింది. ఇప్పటికే హిందీలో పోర్న్ ను మించిన కంటెంట్ ఉండే సీరీస్ రన్ అవుతున్నాయి. ఇంత హంగామా జరుగుతున్నా పోర్న్ మాకు తెలియదు. మేము పొద్దున్నే సుప్రభాతం చదివి రాత్రి మంగళం పాడి సంప్రదాయంగా పడుకుంటాం. సెక్స్ అంటేబూతు.. మాట్లాడకూడదు అంటే వారికి ఏం చెప్పలేం. ఇలాగే పోర్న్ కు ఆదరణ కొనసాగితే కొన్నేళ్లకు పోర్న్ సినిమాలను థియేటర్లలో చూడాల్సిన పరిస్థితి తలెత్తినా ఆశ్చర్యం లేదు.