Begin typing your search above and press return to search.
హైకోర్టు జడ్జి ఆర్డర్ఃసుప్రీం సీజేకు ఐదేళ్ల జైలు
By: Tupaki Desk | 8 May 2017 6:53 PM GMTసుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు మధ్య సాగుతున్న వివాదంలో మరో అనూహ్యమైన పరిణామం చోటుచేసుకుంది. దళిత న్యాయమూర్తిని వేధించారంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు జస్టిస్ సీఎస్ కర్ణన్ శిక్షలు విధించారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ఏడుగురు జస్టిస్‌లకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడం ద్వారా జస్టిస్ కర్ణన్ మరో వివాదానికి తెరతీశారు.
కాగా, ఈ ఏడాది మార్చి నెలలో ధిక్కరణ కేసులో జస్టిస్ కర్ణన్ సుప్రీం ముందు హాజరయ్యారు. ధిక్కరణ కేసుకు స్పందించకుండానే, సుప్రీం బెంచ్‌లో ఉన్న ఏడుగురు న్యాయమూర్తులకు సమన్లు కూడా జారీ చేశారు. ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్‌తో పాటు ఆరుగురు జడ్జిలు తన ముందు హాజరుకావాలంటూ మరో వివాదాస్పద ఆదేశం కూడా జస్టిస్ కర్ణన్ జారీ చేశారు. అయితే కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కొంటున్న జస్టిస్ కర్ణన్‌కు మే 4వ తేదీన వైద్య పరీక్షలు నిర్వహించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోల్‌కతాలో జస్టిస్ కర్ణన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వ అధికారులు ప్రయత్నించగా...జస్టిస్ కర్ణన్ వైద్య పరీక్షలను తిరస్కరించారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఆయన తప్పుపట్టారు. పిచ్చి జడ్జిలు ఇచ్చిన పిచ్చి ఆదేశాలంటూ విమర్శించారు. తాను మెంటల్‌గా ఫిట్‌గా ఉన్నట్లు ఆయన చెప్పారు. తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.