Begin typing your search above and press return to search.
నీ తలకు గురిపెట్టి బౌన్సర్ వేస్తా.. అక్తర్ బెదిరింపుకు భయపడ్డ ఊతప్ప..!
By: Tupaki Desk | 18 May 2021 3:52 AM GMTపాకిస్తాన్ బౌలర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ తన బౌలింగులో బౌండరీలు బాదితే తలకు గురి పెట్టి బౌన్సర్ వేస్తా అని బెదిరించినట్లు టీమిండియా వెటరన్ బ్యాట్స్ మెన్ రాబిన్ ఊతప్ప తాజాగా వెల్లడించాడు. 'వేక్ అప్ విత్ సొరబ్, కార్యక్రమంలో కమెడియన్ సొరబ్ పంత్ తో మాట్లాడుతూ ఆ నాటి సంఘటనను ఊతప్ప గుర్తు చేసుకున్నాడు. 'అది 2007వ సంవత్సరం. పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్ ఆడటానికి ఇండియాకు వచ్చింది. గువాహటి వన్డే లో టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా నేను, ఇర్ఫాన్ పఠాన్ క్రీజులో ఉన్నాం. ఆ సమయంలో షోయబ్ అక్తర్ బౌలింగ్ చేస్తున్నాడు. అతడు 154 కి. మీ స్పీడ్ తో ఓ యార్కర్ విసరగా దాన్ని నేను అడ్డుకోగలిగా.
ఆ తర్వాత బంతి కూడా యార్కర్ విసరడానికి అక్తర్ ప్రయత్నించగా అది ఫుల్ టాస్ రావడంతో ఆ బంతిని బౌండరీ కి తరలించాను. దీంతో ఇక రెచ్చిపోయిన అక్తర్ వరుసగా యార్కర్లు వేయడం మొదలు పెట్టాడు. దీంతో నేనిక ఫ్రంట్ ఫుట్ కు వచ్చి ఆడాలని నిర్ణయించుకున్నా. అనుకున్నట్లుగానే ఫ్రంట్ ఫుట్ లో చక్కటి షాట్లు ఆడగలిగా. ఆ మ్యాచ్ లో మేము విజయం సాధించాం.
మ్యాచ్ ముగిసిన అనంతరం జట్టు సభ్యులు అందరం కలిసి విందు చేసుకున్నాం. ఆ సమయంలో అక్కడికి అక్తర్ వచ్చాడు. మ్యాచ్ లో బాగా ఆడావని ప్రశంసించాడు. మ్యాచ్ లో పదే పదే క్రీజ్ దాటి బయటకు వచ్చి షాట్లు బాగా ఆడావు. కానీ మరో సారి మాత్రం ఇలాగే ఆడితే.. నీ తలకు గురిపెట్టి బౌన్సర్ వేస్తా.. అని హెచ్చరించాడు. అక్తర్ బెదిరించిన తర్వాత మరోసారి అతడి బౌలింగ్ లో ఫ్రంట్ ఫుట్ వచ్చి ఆడే ధైర్యం చేయలేదని' ఊతప్ప వెల్లడించాడు.