Begin typing your search above and press return to search.
పాలేరు ఉప ఎన్నికలో ఉత్తమ్..భట్టి కొత్త ప్రయత్నం?
By: Tupaki Desk | 22 April 2016 9:47 AM GMTఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక నాటకీయ పరిణామాలు దిశగా పయనిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎవరైనా నేతలు మరణిస్తే.. అక్కడ ఉప ఎన్నిక లేకుండా సిట్టింగ్ సభ్యుడి కుటుంబ సభ్యుల్ని రంగంలోకి దించటం.. ఏకగ్రీవంగా ఎన్నుకునే విధానం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ సంప్రదాయాన్ని కేసీఆర్ పాటించలేదు.
మరోవైపు.. ఈ తరహా సంప్రదాయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించినా.. విపక్ష నేత నో అనటంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. అయితే.. తర్వాతి కాలంలో మనసు మార్చుకున్న జగన్.. ఏకగ్రీవం చేసేందుకు ఓకే అంటున్నారు. తెలంగాణలో ఇదే సంప్రదాయాన్ని షురూ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ప్రారంభించిన క్రమంలోనే సీఎం కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఖరారు చేస్తూ ప్రకటించారు.
దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు షాక్ కు గురయ్యారు. పాలేరు ఉప ఎన్నిక ద్వారా కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలని బలంగా అనుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలు ఉత్తమ్ కుమార్.. భట్టి విక్రమార్కలు విపక్షాలన్నింటిని ఏకం చేసే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రమణకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. గత సంప్రదాయాన్ని గుర్తు చేశారు. అదే సమయంలో జగన్ తో కూడా తాము మాట్లాడతామని ఉత్తమ్.. భట్టిలు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. కమ్యూనిస్టులు తాము బరిలోకి దిగనున్నట్లు ప్రకటించటంతో విపక్షాలు ఏకమయ్యే అవకాశం ఉండదా? అన్నది సందేహంగా మారింది. ఏమైనా.. విపక్షాలన్నీ కలిసి రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యుల్ని బరిలోకి దింపటం ద్వారా.. అలేరు ఎన్నికల్లో కేసీఆర్ అండ్ కో కు షాక్ ఇచ్చే వీలుందని భావిస్తున్నారు. దాని కంటే ముందు.. విపక్షాలన్ని ఏకం చేయటంలో ఉత్తమ్.. భట్టిలు విజయం సాధిస్తారా? అన్నది పెద్ద ప్రశ్నగా చెప్పాలి.