Begin typing your search above and press return to search.
ఇందుకే ప్రతిపక్షం కామెడీ అయిపోయేది
By: Tupaki Desk | 31 May 2016 6:49 AM GMTతెలంగాణలో ప్రతిపక్షం ఎక్కడుంది? అసలు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం ఉందా? వారికి సరైన ఆలోచన విధానం ఉందా? ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు. ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు ఒకింత ఇబ్బంది అనిపించినా పరిస్థితులు చూస్తుంటే అవును నిజమేనేమో అనేలా ఉంటాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అధికారికంగా, భారీగా నిర్వహించేందుకు టీఆర్ ఎస్ నేతృత్వంలోని ప్రభుత్వం సన్నద్దమవుతోంది. ఇలా అధికారపక్షం ఉత్సవాలు చేయడానికి సన్నద్దం అవుతుంటే...తెలంగాణ ఇచ్చామని గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ మాత్రం మొక్కుబడిగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. జిల్లాలలో పార్టీ జెండాతో పాటు జాతీయ జెండాను ఎగరవేయాలని రాష్ట్ర పార్టీ నాయకత్వం సూచించి చేతులు దులుపుకున్నది. ఒక వైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని, పార్టీని బలోపేతం చేస్తామని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే నాయకులు తీరా వాటిని ఆచరణలో పెట్టడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహారశైలి మరింత ఆసక్తికరంగా మారింది.
నాటా సభలకు ఉత్తమ్ తో పాటు మాజీ మంత్రి - ఎమ్మెల్యే డీకే అరుణ - సంపత్ కుమార్ లు కూడా హాజరయ్యారు. వీరంతా అమెరికాలోని డల్లాస్ లో జరిగే నాటా సభలకు వెళ్లారు. అనంతరం జరిగే తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం సభలకు హాజరుకానున్నారు. సొంత రాష్ట్రంలోని రాష్ట్ర ఆవిర్భావ వేడుకులను కాదని అమెరికాలో నిర్వహించే నాటా సభలకు వెళ్లడంపై సొంత పార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అధికారంలో ఉండి పార్టీ హైకమాండ్ ను ధిక్కరించి కూడా పోరాటం చేశామని, చివరకు రాష్ట్రంలోని పరిస్థితులను గుర్తించి కాంగ్రెస్ హై కమాండ్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన విషయాన్ని కొందరు సీనియర్లు గుర్తు చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని భావించారు. తీరా తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ ఎస్ ను ఆదరించి అధికారంలో కూర్చోబెట్టిన విషయం తెలిసిందే.
ప్రతిపక్షంగా పార్టీ కార్యక్రమాలు ఎలా ఉన్నా అధికార పార్టీకి దీటుగా తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవ రెండేళ్ల వేడుకులనైనా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తే బాగుండేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. కీలకమైన సమయంలో రాష్ట్ర పార్టీ రథసారథే దేశం విడిచి అమెరికాలోని నాటా సభలకు వెళ్లడం విచిత్రంగా ఉందంటున్నారు. ఆవిర్భావ వేడకుల కంటే.. నాటా సభలే ముఖ్యమా..? అని ఉత్తమ్ తో పాటు అమెరికాకు వెళ్లిన పార్టీ నాయకుల తీరును ద్వితీయశ్రేణి నాయకులు తప్పుపడుతున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రెండేళ్ల టీఆర్ ఎస్ పాలనకు వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో పెద్దసభను నిర్వహిస్తే కేడరల్ లో ఉత్సాహం వచ్చేదని అంటున్నారు. ఇలా చేస్తున్నాం కాబట్టే తాము చులకన కావాల్సి వస్తోందని వాపోతున్నారు.