Begin typing your search above and press return to search.
అందరినీ నవ్వించిన ఉత్తమ్.. పవన్
By: Tupaki Desk | 16 Aug 2017 5:37 AM GMTబ్రిటీషోడి మనల్ని వదిలి పెట్టి వెళ్లిపోయినా.. తన జాడలు మాత్రం వదలకుండా వెళ్లాడనే చెప్పాలి. శతాబ్దాల పాటు దేశాన్ని పాలించి ఉండటం.. వారికి చెందిన కొన్ని అలవాట్లు సంప్రదాయాల రూపంలో మనల్ని వెంటాడుతున్నాయని చెప్పాలి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రముఖులకు విందులు ఇవ్వటం అప్పటి బ్రిటీష్ పాలకులకు అలవాటు. అదే తీరును కంటిన్యూ చేస్తున్నారు మన పాలకులు కూడా.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆగస్టు 15.. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీకి గుర్తుగా నిర్వహించే గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహిస్తే.. రాష్ట్రాల్లో గవరర్లు.. జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు ఇదే తరహా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంటారు. ఈ రెండు సందర్భాల్లో రాజకీయ.. న్యాయ.. పాలనా విభాగాలకు చెందిన ప్రముఖులతో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకలకు హాజరవుతుంటారు. ఈ రెండురోజుల్లో సాయంత్రం వేళలో ఎట్ హోం కార్యక్రమాన్ని గవర్నర్ తన అధికార నివాసమైన రాజ్ భవన్ లో నిర్వహిస్తుంటారు.
తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్న నరసింహన్ మరోసారి ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గవర్నర్ నరసింహన్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. దీంతో.. పవన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు.. రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అందరికంటే ముందుగా పవన్ ఈ కార్యక్రమానికి రావటంతో పాటు.. చివరి వరకూ ఉన్నారని చెప్పాలి. ఈసారి ఎట్ హోం కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా పవన్ మారారు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. పలువురితో ఆయనకు నేరుగా పరిచయం లేదు.
దీంతో.. ఆయన్ను పరిచయం చేసుకోవటం.. పలుకరించటం కనిపించింది. అన్నింటికంటే మించి.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రథసారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పవన్ ల మధ్య నడిచిన సంభాషణ నవ్వులు పువ్వులు పూచేలా చేసింది. పవన్ ఎదురైన వేళ.. ఉత్తమ్ కమార్ రెడ్డి తనను తాను పరిచయం చేసుకోవటంలో భాగంగా.. ఐయామ్ ఉత్తమ్ అని అనగా..దానికి స్పందనగా పవన్.. ఐయాం పవన్ అంటూ చేయి కలపటంతో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. ఇరువురు నేతలు కూడా హాయిగా నవ్వుకోవటం కనిపించింది.