Begin typing your search above and press return to search.
ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఏమిటీ ఉత్త మాటలు!
By: Tupaki Desk | 2 Jun 2019 1:56 PM GMTతెలంగాణలో భారతీయ జనతా పార్టీ విజయం కేవలం లక్కు మాత్రమేనట! తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనట. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యామ్నాయం కాలేదట! ఇవీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన వచనాలు!
లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వాళ్లు కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ సీట్లను నెగ్గారు. కాంగ్రెస్ పార్టీకి దక్కింది మూడు ఎంపీ సీట్లు మాత్రమే. అదే బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు దక్కాయి. అసలు బీజేపీ ఏదో పోటీ ఇస్తుందని అనుకున్నారు కానీ.. బీజేపీ సంచలనం నమోదు చేసింది.
అలాంటి సంచలనాన్ని కేవలం 'లక్' అని అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒకవేళ బీజేపీది లక్ అని అనుకుంటే.. కాంగ్రెస్ ది మాత్రం విజయమని ఎలా చెబుతారు? బీజేపీ సాధించిన మెజారిటీలతో పోల్చినా కాంగ్రెస్ కు దక్కిన మెజారిటీలు గొప్పవి ఏమీ కావు.
భారతీయ జనతా పార్టీ మంచి మెజారిటీలే సాధించింది. కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు సాధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి సర్కారుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం అనే ట్యాగ్ పోయే పరిస్థితి ఏర్పడింది. బీజేపీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ కు దడ పుడుతోంది. అందుకే తెలంగాణ రాష్ట్ర సమితికి బీజేపీ ప్రత్యామ్నాయం కాదు, కాలేదు.. అంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు.
అయినా మాటలతో అయ్యేది ఏమీ ఉండదు. కాంగ్రెస్ పార్టీ తమ ట్రెడిషనల్ ఓటు బ్యాంకు చేజారకుండా చూసుకోవాల్సిన టైమ్ వచ్చేసినట్టుంది. బీజేపీ పాగా వేస్తే తెలంగాణ రాష్ట్ర సమితికే కాదు.. కాంగ్రెస్ కూడా అది పెద్ద దెబ్బే అయ్యే అవకాశాలున్నాయి!