Begin typing your search above and press return to search.
ఎన్నికల తర్వాత కేసీఆర్..కేటీఆర్ లు అలా చేస్తారా?
By: Tupaki Desk | 13 Sep 2018 12:15 PM GMTతెలంగాణలో రాజకీయం అంతకంతకూ వేడెక్కుతోంది. ముందస్తు ఎన్నికల నిర్ణయంతో పాటు.. అభ్యర్థుల ప్రకటన.. తర్వాతి కాలంలో విపక్షానికి చెందిన పలువురు నేతలపై కేసుల మీద కేసులు నమోదు అవుతున్న తీరు.. జైలుకు తీసుకెళుతున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
తనకున్న పవర్ తో.. కేసీఆర్ డైరెక్షన్ లో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజల్లోనూ నెగిటివ్ ఇమేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఇలాంటివేళ.. తెలంగాణ అధికారపక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది విపక్షం. తాజాగా ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.. తాజా మాజీ మంత్రి కేటీఆర్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ సన్యాసం ప్రకటిస్తే.. కేటీఆర్ మాత్రం విదేశాలకు వెళ్లిపోతారని చెప్పారు. కేటీఆర్ అమెరికాకు తిరిగి వెళ్లిపోవటం ఖాయమని మండిపడ్డారు. తెలంగాణను రక్షించుకోవటం కోసమే కామన్ మినిమ్ ప్రోగ్రామ్ తో వెళ్లాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. పొత్తులో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరపలేదన్న ఉత్తమ్.. కేసీఆర్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు.
కొండగట్టు బాధితుల్ని పరామర్శించేందుకు కేసీఆర్ వెళ్లకపోవటాన్ని తప్పు పట్టిన ఉత్తమ్.. తాము పరామర్శించి ఆదుకుంటామన్నారు. గెలుపుపై భారీ ధీమాను వ్యక్తం చేస్తున్న కేసీఆర్ కు కొత్త సందేహాలు కలిగేలా ఉత్తమ్ తన విమర్శల తీవ్రతను అంతకంతకూ పెంచుకుంటూ పోవటం గమనార్హం.