Begin typing your search above and press return to search.

స‌భ అట్ట‌ర్ ఫ్లాప్ అని తేల్చేసిన ఉత్త‌మ్‌!

By:  Tupaki Desk   |   3 Sep 2018 5:48 AM GMT
స‌భ అట్ట‌ర్ ఫ్లాప్ అని తేల్చేసిన ఉత్త‌మ్‌!
X
భారీ అంచ‌నాల మ‌ధ్య నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌ను ఒక్క మాట‌లో తేల్చేశారు తెలంగాణ కాంగ్రెస్ ర‌థ‌సార‌ధి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ కాద‌ని.. అదో ప్లాప్ షోగా తేల్చేశారు ఉత్త‌మ్‌. దీంతో.. ఈ భారీ బ‌హిరంగ స‌భ కోసం ఖ‌ర్చు చేసిన‌ట్లుగా చెబుతున్న రూ.300 కోట్లు ప్ర‌యోజ‌నం లేకుండా పోయిన‌ట్లుగా చెప్పాలి.

మామూలుగా అయితే.. కేసీఆర్ ప్ర‌సంగం ముగిసిన త‌ర్వాత.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌తిస్పంద‌నగా ప్రెస్ మీట్ పెట్టినా.. నోరార క‌డిగేసే ప‌రిస్థితి ఉండేది కాదు. మాట‌ల కోసం త‌డుముకోవాల్సి వ‌చ్చేది. కానీ.. తాజా ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్ర‌గ‌తి నివేద‌న స‌భ పూర్తి అయిన కాసేప‌టికే మీడియాతో మాట్లాడిన ఉత్త‌మ్‌.. కేసీఆర్ స‌భ అట్ట‌ర్ ప్లాప్ అయ్యింద‌ని తేల్చేశారు. తాము చెప్పిన‌ట్లుగా రూ.300 కోట్లు ఖ‌ర్చుచేసి ప్ర‌గ‌తి నివేదిక స‌ద‌స్సు ఊసూరుమ‌నిపించింద‌న్నారు.

అవినీతి సొమ్మును ఖ‌ర్చు చేశార‌న్న ఆరోప‌ణ చేసిన ఉత్త‌మ్‌.. స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగం త‌స్సుమ‌నిపించింద‌న్నారు. కేసీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యాక ఒక్క విద్యుత్ ప్రాజెక్టు అయినా మొద‌లు పెట్టారా? అని ప్ర‌శ్నించారు. మిష‌న్ భ‌గీర‌థ కార్య‌క్ర‌మంలో భాగంగా 10 శాతం మాత్ర‌మే ప‌నులు పూర్తి అయిన‌ట్లుగా ఆరోపించారు. చెప్పిన స‌మ‌యానికి తాను కానీ నీళ్లు ఇవ్వ‌టంలో ఫెయిల్ అయ్యార‌న్నారు. కేసీఆర్ అమ‌లుచేస్తున్న‌ది మిష‌న్ కాక‌తీయ కాద‌ని.. క‌మీష‌న్ భ‌గీర‌థ అంటూ తిట్ల దండ‌కం అందుకున్నారు. కేసీఆర్ బ‌హిరంగ స‌భ అయ్యాక‌.. ఆయ‌న్ను మాట‌ల‌తో ఏసుకున్న అతి కొద్ది మందిలో ఉత్త‌మ్ ఒక‌రిగా నిలుస్తార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కేసీఆర్ త‌న ప్ర‌సంగంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్ని మిస్ చేసిన‌ట్లు చెప్ప‌గా.. విపక్షాలు మాత్రం భారీగా లిస్ట్ రాసుకొని మ‌రీ గుర్తు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.