Begin typing your search above and press return to search.
వరంగల్ గెలుపు మీద టీ కాంగ్రెస్ కాన్ఫిడెన్స్
By: Tupaki Desk | 30 Oct 2015 12:31 PM GMTవరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలు చూస్తే.. కాస్తంత విస్మయానికి గురి కావాల్సిందే. బరిలోకి దిగేందుకు సరైన అభ్యర్థి లేరని కిందామీదా పడిపోతున్న పరిస్థితి. తాము ఏరి కోరి ఎంపిక చేసిన అభ్యర్థి బరిలోకి దిగేందుకు సైతం ససేమిరా అంటున్న వేళ.. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్న మాటలు విన్న వారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి.
వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి తమ పార్టీ ఒక జాతీయ సంస్థతో సర్వే చేయించిందని వివరాలు చెప్పుకొచ్చిన ఆయన మాటలు విన్న విలేకరులకు నోట మాట రాని పరిస్థితి. ఒక పక్క అభ్యర్థి లెక్క తేలకున్నా.. విజయం తమదేనని.. మెజార్టీ ఎంత వస్తుందో కూడా లెక్క చెప్పుకొస్తున్నారు ఉత్తం కుమార్ రెడ్డి.
వరంగల్ ఉప ఎన్నికలో తమ పార్టీకి లక్షా ఐదు వందల మెజార్టీ వచ్చినట్లు సర్వే చేసిన సంస్థ పేర్కొందని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో 3,92,500 ఓట్ల మెజారిటీ సాధించిన టీఆర్ ఎస్ పార్టీ.. ఉప ఎన్నికల్లో మాత్రం గెలిచే అవకాశం లేదని తేల్చేశారు. అభ్యర్థిని ఖరారు చేయక ముందే.. ఎన్నికల్లో వచ్చే మెజార్టీ అంకెలతో సహా చెప్పటం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మాత్రమే చెల్లుతుందేమో.