Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ లోకి ప్రముఖులు...స్వీప్ చేసేస్తాం
By: Tupaki Desk | 22 Jan 2018 1:02 PM GMTసుదీర్ఘ ఉద్యమం తర్వాత ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగడం లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో పాలకుల కళ్ళు నెత్తికెక్కాయని...టీఆర్ ఎస్ వైఫల్యాలపై జూన్ 2 భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. గాంధీభవన్ లో ఆయన సోమవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను బాగు చేసుకునేందుకే పెద్దఎత్తున కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు.
ఈ ఏడాది డిసెంబర్ లోనే ముందస్తు ఎన్నికలు వచ్చే వాతావరణం కనిపిస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్నీకమిటీలను పటిష్టం చేసేందుకు ముందుకు సాగుతున్నామన్నారు. రిజర్వుడ్ నియోజకవర్గాల్లో మాదిరి కొన్ని జనరల్ నియోజకవర్గాలకు ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తామన్నారు. త్వరలో ఇతర పార్టీలోని చాలా మంది ప్రముఖులు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం ఫిబ్రవరిలో కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభిస్తామని తెలిపారు. ఈ బస్సు యాత్ర బడ్జెట్ సమావేశాల తర్వాత కూడా కొనసాగుతుందన్నారు. డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ముందుకు సాగుతున్నట్లు వివరించారు.
నీళ్ల కోసం కాదు ..కమిషన్ల కోసమే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 70స్థానాలకు పైగా గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ తెలంగాణాలో కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పారు. ఉత్తర తెలంగాణలో కూడా గెలిచేందుకు తాము సన్నాహాలు చేస్తున్నామని...త్వరలో ఇందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేస్తామని తెలిపారు.